యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ భావాలున్న వీసీలు, అధ్యాపకులు.. ఇది బంధుప్రీతికి నిదర్శనం కాదా ? - కపిల్ సిబల్

Published : May 17, 2023, 02:08 PM IST
యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ భావాలున్న వీసీలు, అధ్యాపకులు.. ఇది బంధుప్రీతికి నిదర్శనం కాదా ? - కపిల్ సిబల్

సారాంశం

యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావాలున్న వీసీలు, తాత్కాలిక అధ్యాపకుల నియామకం జరిగిందని ఇది బంధుప్రీతికి నిదర్శనం కాదా అని ప్రధాని నరేంద్ర మోడీని రాజ్యసభ సభ్యుడు, ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన చేసిన ఓ ట్వీట్ లో ప్రధానిని విమర్శించారు. 

రిక్రూట్ మెంట్ వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు బంధుప్రీతిని అంతం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ భావాలున్న వైస్ చాన్స్ లర్లు, తాత్కాలిక అధ్యాపకులు నియామకమయ్యారని, ఇది నెపోటిజానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 

ఈ మేరకు కపిల్ సిబల్ ఓ ట్వీట్ చేశారు. ‘‘నియామక ప్రక్రియలో మార్పులు అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని అంతం చేశాయని ప్రధానమంత్రి అన్నారు. అభినందనలు. కానీ విశ్వవిద్యాలయాలలో ఆర్ఎస్ఎస్ , ఆర్ఎస్ఎస్ భావాలున్న వీసీల నియామకం, తాత్కాలిక అధ్యాపకుల నియామకం బంధుప్రీతికి నిలువెత్తు నిదర్శనం. పీఎం గారూ మీరేమంటారు’’ అని పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో ‘అల్లర్ల ప్రయోగశాల’ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ - శివసేన (యూబీటీ) ఆరోపణ

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ‘రోజ్‌గార్ మేళా’లో 71,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌లో తీసుకువచ్చిన మార్పులు వల్ల అవినీతి, బంధుప్రీతి అవకాశాలను అంతం చేశాయని అన్నారు.  కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్వహిస్తున్న రోజ్ గార్ మేళాలు యువత పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత తొమ్మిదేళ్లలో నియామక ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ద్వారా ప్రాధాన్యత ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా పోయిందని మోడీ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ చేశామనీ, గత తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వివరించారు. 2018-19 నుంచి 4.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందారనీ, అధికారిక ఉపాధి పెరుగుతోందని ప్రధాని ఈపీఎఫ్ఓ నికర పేరోల్ గణాంకాలను ఉదహరించారు. వాల్ మార్ట్, ఆపిల్, ఫాక్స్ కాన్, సిస్కో సహా ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోల‌తో ఇటీవల తాను జరిపిన సమావేశాలను ప్రధాని ప్రస్తావిస్తూ దేశంలో పరిశ్రమలు, పెట్టుబడులపై అపూర్వమైన సానుకూలత ఉందని నొక్కి చెప్పారు. 

కేరళలో 64,000 మంది మాత్రమే నిరుపేదలు - సీఎం పినరయి విజయన్

2018-19 నుంచి 4.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందారని, అధికారిక ఉపాధి పెరుగుతోందని ఈపీఎఫ్ఓ నికర పేరోల్ గణాంకాలను ప్రధాని ఉదహరించారు. ఎఫ్ డీఐలు, దేశ రికార్డు ఎగుమతులు భారత్ లోని ప్రతి మూలలోనూ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయనీ, అభివృద్ధి చెందుతున్న రంగాలకు తమ ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇవ్వడంతో ఉద్యోగాల స్వభావం కూడా మారుతోందని ఆయన పేర్కొన్నారు.

త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు.. అరెస్టు చేసి, సిట్ విచారణకు ప్రభుత్వ ఆదేశం

కాగా.. యూపీఏ 1, 2 హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. అయితే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఆయన ఇటీవల 'ఇన్సాఫ్' అనే నాన్ ఎలక్టోరల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu