G-20 meet: శ్రీనగర్ మార్కెట్ ఏరియాకు మెరుగులు.. యూరప్ ప్రాంతాలతో పోలికలు..సెల్ఫీ పాయింట్‌గా పోలో వ్యూ మార్కెట్

Published : May 17, 2023, 01:33 PM IST
G-20 meet: శ్రీనగర్ మార్కెట్ ఏరియాకు మెరుగులు.. యూరప్ ప్రాంతాలతో పోలికలు..సెల్ఫీ పాయింట్‌గా పోలో వ్యూ మార్కెట్

సారాంశం

జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాల్ లేక్ సమీపంలో ఎస్‌కేఐసీసీ వేదికగా జీ 20 సమావేశం జరగనుంది. ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ 20 సదస్సుకు ఎజెండాను తయారు చేయనుంది. ఈ సమావేశ వేదికను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సుందరీకరణ పనులు చేపట్టారు. దీంతో పోలో వ్యూ మార్కెట్ ఒక సెల్ఫీ పాయింట్ గా మారిపోయింది.  

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సుమారు 70 ఏళ్ల పురాతనమైన పోలో వ్యూ మార్కెట్ కొత్త కాంతిని సంతరించుకుంది. సరికొత్త మెరుగులు అద్దుకుని యూరప్ దేశాల్లోని వీధులకు తగ్గకుండా ఆకర్షిస్తున్నది. టూరిస్టులకు, స్థానికులకు ఫ్యాషనేబుల్ షాపింగ్ సెంటర్‌గా ఉన్న ఈ వీది ఇప్పుడు తళుకులీనుతున్నది. వచ్చే వారం ఇక్కడ జీ 20 సమావేశం జరుగుతున్న తరుణంలో ఈ వీధి సుందరీకరణ పనులు చేపట్టారు.

ఈ మార్కెట్ దాల్ లేక్ సమీపంగానే ఉంటుంది. ఆల్ ఇండియా రేడగియో, దూరదర్శన్ కేంద్ర, మ్యూజియం వంటి ముఖ్యమైన భవంతులూ ఇదే లైన్‌లో ఉంటాయి. జీ 20 సమావేశానికి కేంద్రమైన షేర్ ఎ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)కి వెళ్లే దారి మధ్యలోనే ఈ మార్కెట్ ఉంటుంది. న్యూఢిల్లీలో నవంబర్ నెలలో నిర్వహించబోయే జీ 20 సదస్సుకు కావాల్సిన అజెండాను కశ్మీర్‌లో జరిగే సమావేశంలో ఖరారు చేస్తార.

మెరుగులు దిద్దిన పోలో వ్యూ మార్కెట్ ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుని సెల్ఫీ పాయింట్‌గా మారిపోయింది. చాలా మంది ఇక్కడికి రిలాక్స్ కావడానికి వచ్చి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. శ్రీనగర్ నడిబొడ్డులో ఉండే పోలో వ్యూ మార్కెట్‌ను ఒక పాదాచారుల వీధిగా మార్చామని, ఈ హంగులు మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తాయని చెప్పారు. తద్వార రిటేల్ సేల్ పెరగడంతోపాటు పర్యాటకులూ ఈ ప్రాంతాన్ని చూసి ముగ్దులవుతారని వివరించారు.

శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, సీఈశో ఆఫ్ శ్రీనగర్ స్మార్ట్ సిటీ అథర్ అమీర్ ఖాన్ పోలో వ్యూ మార్కెట్ చిత్రలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి చర్యలు ఇంకొన్ని తీసుకుంటామని, దీనిపై ఓ ప్రణాళికే ఉన్నదని తెలిపారు. దేశంలోని మహా నగరాలకు పోటీగా కశ్మీర్‌లోనూ నగరాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. రెసిడెన్సీ రోడ్, లాల్ చౌక్, ఓల్డ్ సిటీల్లోని మార్కెట్‌ల తరహాలోనే పోలో వ్యూ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని వివరించారు.

ఈ సుందరీకరణలో చినార్, ఇతర చెట్ల మొదళ్లను కవర్ చేయకపోవడం తనకు నచ్చిందని ఓ యూజర్ పేర్కొన్నాడు. నిజానికి చెట్ల కాండాలను కవర్ చేస్తే ఆ వృక్షం క్రమంగా మెల్లిగా చనిపోవుతుందని యూసుఫ్ జమీల్ అనే ట్విట్టర్ యూజర్ తెలిపారు.

Also Read: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు.. అరెస్టు చేసి, సిట్ విచారణకు ప్రభుత్వ ఆదేశం

గతేడాది నుంచి జరుగుతున్న ఈ రిపేర్ పనులపై అసంతృప్తి ఉన్నప్పటికీ వ్యాపారులు కొత్త హంగులతో సంతోషపడుతున్నారు. ఈ కొత్త వీధికపై పర్యాటకులు, స్థానికులు కూడా మనసు పారేసుకుంటున్నారు. తమకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నదని, ఇక్కడికి వస్తున్నవారి జన సంఖ్య కూడా పెరుగుతున్నదని ఓ షాప్ కీపర్ చెప్పారు.  అయితే, పార్కింగ్ ఫెసిలిటీ ఒకటి ఏర్పాటు చేయాలని పలువురు షాప్ కీపర్లు తెలిపారు.

ఢిల్లీని కన్నాట్ ప్లేస్, చాందినీ చౌక్ మార్కెట్ల తరహాలో శ్రీనగర్ నగరంలో పోలో వ్యూ మార్కెట్ ఉన్నది.  కశ్మీర్ లోయలో ముఖ్యంగా టూరిస్టుల అభిప్రాయం ఇదే. 1954లో 35 షాపులతో ఇక్కడ మార్కెట్ వెలిసింది.  ఓ పునురుద్ధరణ కార్యక్రమంలో ఆ షాపులు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ షాపులు 50కి పెరిగి ఇప్పుడు పోలో వ్యూ మార్కెట్ లేన్ అద్భుతంగా కనిపిస్తున్నది. ఇందులో చాలా వరకు కశ్మీర్ ఆర్ట్స్, క్రాఫ్ట్‌ల షాపులే ఉంటాయి.

అంతర్జాతీయ స్థాయిలో సమావేశ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇక్కడ హంగులు తీర్చిదిద్దింది. ఈ సుందరీకరణకు ఈ నెల 15వ తేదీ వరకు తుది గడువు ఇచ్చింది. ఇప్పుడు ఈ వేదిక ఒక వైభవాన్ని సంతరించుకుంటున్నది. ఇంటీరియర్ సరర్ఫేసెస్, ట్రాక్స్, లాన్‌లు, కంప్లెక్స బ్యాక్‌యార్డ్‌ అన్నీ అందంగా మలిచారు.

షేక్ ఉల్ ఆలాం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎస్‌కేఐసీసీ మధ్య 15 కిలో మీటర్ల దూరం ఉండొచ్చు. ఈ దారి పొడుగున మెరుగులు దిద్దారు.

 

---- ఎహెసాన్ ఫాజిలి

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu