డీకే శివకుమార్ ఆస్తుల కేసులో సీబీఐ పిటిషన్: సుప్రీం విచారణ

Published : May 17, 2023, 01:14 PM ISTUpdated : May 17, 2023, 01:22 PM IST
డీకే శివకుమార్ ఆస్తుల కేసులో  సీబీఐ పిటిషన్: సుప్రీం విచారణ

సారాంశం

ఆస్తుల  కేసులో  సీబీఐ పిటిషన్ ను  సుప్రీంకోర్టు విచారణకు  స్వీకరించింది.  సీబీఐ  విచారణపై  కర్ణాటక  హైకోర్టు స్టే  విధించింది. 

న్యూఢిల్లీ: ఆస్తుల కేసులో  కర్ణాటక  పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ పై  సీబీఐ దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు  విచారణకు  స్వీకరించింది. ఆస్తుల కేసులో  కర్ణాటక  పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ పై సీబీఐ విచారణపై  కర్ణాటక హైకోర్టు  స్టే విధించింది.  కర్ణాటక హైకోర్టు  స్టే  ను  ఎత్తివేయాలని   సీబీఐ  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ  దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు   విచారణకు  స్వీకరించింది. ఆస్తుల  కేసులో  ఈ ఏడాది మార్చి మాసంలో  కర్ణాటక  హైకోర్టు   సీబీఐ దర్యాప్తుపై  మధ్యంతర  స్టేను  పొడిగించింది.

2013  నుండి  2018 వరకు కర్ణాటకలో  సిద్దరామయ్య  సీఎంగా  కొనసాగారు.  కాంగ్రెస్ పార్టీ  అధికారంలో  ఉన్న సమయంలో  డీకే శివకుమార్  తన  ఆస్తులు, సంపద పెరిగిందని  2020  అక్టోబర్  3న  ఎఫ్ఐఆర్ నమోదైంది.

2013 ఏప్రిల్ లో  డీకే  శివకుమార్ అతని కుటుంబ సభ్యుల ఆస్తులు  రూ. 33.92  కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు కలిగి  ఉన్నారు.  అయితే  2018 నాటికి  డీకే శివకుమార్ ఆస్తులు  రూ. 162.53  కోట్లకు పెరిగినట్టుగా   సీబీఐ ఎఫ్ఐఆర్  పేర్కొంది.2017లో  డీకే  శివకుమార్  కు  చెందిన  సంస్థలపై  ఐటీ శాఖ  అధికారులు  సోదాలు  నిర్వహించారు.   డీకే  శివకుమార్ పై  సుమారు  19 పెండింగ్  కేసులున్నాయని సమాచారం.

కర్ణాటకలో  జరిగిన  అసెంబ్లీ  ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  135 అసెంబ్లీ  సీట్లు దక్కాయి.   డీకే  శివకుమార్ పై ఉన్న కేసులు  శివకుమార్ కు  సీఎం పదవికి అడ్డంకిగా మారాయనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  అయితే  ఈ  కేసులు  డీకే  శివకుమార్ కు సీఎం పదవికి అడ్డంకిగా మారదని  కర్ణాటక  కాంగ్రెస్  ఇంచార్జీ  శ్రీధర్ బాబు  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu