వార్నీ.. మహిళను కాటేసిన పాము.. విషసర్పాన్ని కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లిన భర్త.. యూపీలో వింత ఘటన

By Asianet News  |  First Published Apr 17, 2023, 3:50 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యను కాటేసిందని ఓ భర్త పామును కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. దీంతో డాక్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఉన్నావ్ జిల్లాలో ఇది చోటు చేసుకుంది. 


సాధారణంగా ఎవరైననా పాము కాటేస్తే ఏం చేస్తారు. ముందుగా బాధితులను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ అందిస్తారు. కానీ ఓ వ్యక్తి అలా చేయలేదు. అతడి భార్యను పాము కరించింది. దీంతో ఆమెతో పాటు ఆ పామును కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆ పామును చూసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. ఈ వింత ఘటన యూపీలో చోటుచేసుకుంది. అయితే పామును తీసుకురావడానికి గల కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.

జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుంది - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

Latest Videos

ఉన్నావ్ జిల్లాలోని సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఉమర్ అత్వా గ్రామంలో నరేంద్ర అనే వ్యక్తి తన భార్య కుస్మాతో కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కుస్మా వంట గదిలో పని చేస్తుండగా ఓ కొండ చిలువ ఆమెను కాటేసింది. దీనిని గమనించిన ఆమె గట్టిగా కేకలు వేసింది. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

బీహార్ లో కల్తీ మద్యానికి 22 మంది బలి.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం ప్రకటించిన సీఎం.. కానీ ఓ కండీషన్

స్థానికులు వెంటనే ఆ మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె భర్తకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. అయితే ఆశ్చర్యకరంగా నరేంద్ర తన భార్యను చూడటానికి వెంటనే హాస్పిటల్ కు వెళ్లలేదు. దానికి బదులు ముందుగా ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న పామును పట్టుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. 

సామాజిక న్యాయం, సాధికారత కోసం కుల గణన చేపట్టండి - ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ

అయితే హాస్పిటల్ లో పామును చూసిన డాక్టర్లు, అధికారులు అవాక్కయ్యారు. పామును ఇక్కడికెందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తన భార్యను ఏ పాము కరిచిందో తనకు తెలియదని, ఏ పాము కరిచిందో చెప్పాలని డాకర్లు అడితే తాను చెప్పలేనని, అందుకే దానిని పట్టుకొని తీసుకొచ్చానని దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. కాగా.. పాము కాటులో గాయపడిన మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని జిల్లా హాస్పిటల్ డాక్టర్ తుషార్ శ్రీవాస్తవ తెలిపారు.

95 శాతం మంది భారతీయులకు జాతీయ జెండాపై అవగాహన లేదు - ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అషిమ్ కోహ్లీ..

ఇలా ఘటనే ఇదే రాష్ట్రంలోని మాఖీ పోలీస్ సర్కిల్ పరిధిలోని అఫ్జల్ నగర్ ప్రాంతంలో కొంత కాలం కిందట చోటు చేసుకుంది. ఆ సమయంలో కూడా ఓ భర్త, తన భార్యతో పాటు పామును కూడా హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. ‘‘ నా భార్యను ఏ పాము కరిచిందో అడిగితే? నాకైతే తెలియదు. అందుకే మీరే చూడాలని పామును తీసుకొచ్చాను’’ అని డాక్టర్లతో అన్నాడు. 
 

click me!