జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుంది - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

Published : Apr 17, 2023, 02:52 PM IST
జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుంది - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

సారాంశం

జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేస్తుందని బీజేపీ నాయకుడు, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఆయన బీజేపీలోనే కొనసాగి ఉండే చాలా బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

బీజేపీ సీనియర్ లీడర్ జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ లో చేరడంపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో పెద్ద పదవిని ఆఫర్ చేశారని తెలిపారు. అయినా కూడా ఆయన పార్టీ మారారని చెప్పారు. ‘‘జగదీశ్ శెట్టర్ ఈ ప్రాంతంలో సీనియర్, కీలక నేత. జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన  కొనసాగి ఉంటే (పార్టీలో) అంతా బాగుండేది’’ అని బసవరాజ్ బొమ్మై హుబ్బళ్లిలో మీడియాతో అన్నారు.

అతిక్ హత్య కేసులో సీబీఐ విచారణకు డిమాండ్.. 'సుప్రీం'లో పిటిషన్ .. 183 ఎన్‌కౌంటర్లపై కూడా...

జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ వాడుకొని బయటకు విసిరేస్తుందని బొమ్మై తెలిపారు. వీరేంద్ర పాటిల్, బంగారప్ప, దేవరాజ్ ఉర్స్ లను బహిష్కరించిన పార్టీలోకే ఆయన వెళ్లారని అన్నారు. ‘‘ ఎన్నికల తర్వాత మొదట గౌరవం, ఆ తర్వాత అవమానం. జగదీష్ శెట్టర్ ను ఉపయోగించి బయటకు విసిరేస్తారు. యడ్యూరప్ప మాతో ఉన్నంత వరకు లింగాయత్ లు మాతోనే ఉంటారు’’ అని బొమ్మై అన్నారు.

సామాజిక న్యాయం, సాధికారత కోసం కుల గణన చేపట్టండి - ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ

ఇదిలా వుండగా.. శెట్టర్ చేరికతో కర్ణాటకలో లింగాయత్ ఓటు బ్యాంకును చీల్చవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. లింగాయత్ ఓటు బ్యాంకు ఇప్పటి వరకు బీజేపీకి అండగా నిలవడం గమనార్హం. కాషాయ పార్టీకి చెందిన సీనియర్ లింగాయత్ నేతలు మాజీ డీసీఎం లక్ష్మణ్ సవది, శెట్టర్ లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆ వర్గాల మద్దతు పార్టీకి బలం చేకూరస్తుందని, బీజేపీకి నష్టం చేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 

1990లో దివంగత సీఎం వీరేంద్ర పాటిల్ అనూహ్యంగా గద్దె దింపిన తర్వాత లింగాయత్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ను వీడింది. లింగాయత్ బలమైన వ్యక్తి అయిన పాటిల్ నాయకత్వంలో కాంగ్రెస్ 1989 లో 224 ఎమ్మెల్యే సీట్లకు గాను 178 స్థానాలను గెలుచుకుంది. ఇది ఇప్పటి వరకు సాధించిన అతిపెద్ద విజయం. ఆ సమయంలో చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు, లింగాయత్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ఈ పరిణామాన్ని ఆ పార్టీ సువర్ణావకాశంగా భావిస్తోంది. యడ్యూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లింగాయత్ ఓటు బ్యాంకును చెక్కుచెదరకుండా ఉంచడం కాషాయ పార్టీకి కష్టసాధ్యమని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు