వందే భారత్ కోసం రైల్వే బోర్డు చైర్మన్ పాదాలను తాకాల్సి వచ్చింది - హైస్పీడ్ రైలు సృష్టికర్త సుధాంశు మణి

By Asianet NewsFirst Published Mar 17, 2023, 4:43 PM IST
Highlights

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రాజెక్టు అనుమతి కోసం రైల్వే బోర్డు చైర్మన్ కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని ఆ రైలు సృష్టికర్త సుధాంశు మణి తెలిపారు. ఆ రైలు తయారీని 18 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు. ఇటీవల ఆయన ‘దైనిక్ భాస్కర్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రైలుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

భారతదేశపు మొట్టమొదటి ఆధునిక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. అయితే ఈ రైలు రూపొందించడంలో, దానిని విజయవంతంగా పట్టాలపైకి తీసుకురావడానికి కారణమైన వ్యక్తి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కృషి లేకపోతే ఇంత తొందరగా మన దేశంలో ఇలాంటి రైళ్లు సేవలందించేవి కావు. ఇంతకీ ఎవరాయన అని అనుకుంటున్నారా ? ఆయన పేరు సుధాంశు మణి. ఈ రంగంలో 38 సంవత్సరాల అనుభవం ఉన్న రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ ఆయన. ఇటీవల సుధాంశు మణి ‘దైనిక్ భాస్కర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రైలు అనుమతి కోసం పడిన కష్టాలను, ఆ హై స్పీడ్ రైలుకు తయారీ సమయంలో పెట్టిన పేరును తెలియజేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఐదు రోజుల ఈడీ కస్టడీ పొడిగింపు

‘‘మూడింట ఒక వంతు ఖర్చుతో ప్రపంచ స్థాయి రైలును అభివృద్ధి చేస్తామన్న మా వాదనలను మంత్రిత్వ శాఖ అధికారులు అనుమానించారు. మా వాదన కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అనుకున్నారు. మమ్మల్ని నమ్మలేదు. దీంతో విసిగిపోయి అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ ను సంప్రదించాను. నేను ట్రైన్ 18 (వందే భారత్ ఎక్స్ ప్రెస్)ను గురించి ఆయనకు చెప్పాను. విదేశాల నుంచి అలాంటి రైలును దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చులో మూడింట ఒక వంతు ఖర్చుతో ఐసీఎఫ్ బృందం ప్రపంచ స్థాయి రైలును తయారు చేయగలదని కూడా హామీ ఇచ్చాను’’ అని సుధాంశు మణి తెలిపారు.

‘‘కానీ మరో 14 నెలల్లో రైల్వే చైర్మన్ పదవీ విరమణ చేయనున్నారు. అందువల్ల మా పనిని కావాలనే ఉద్దేశంతో మేము అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆయన రిటైర్ అయ్యేలోగా ఈ రైలు సిద్ధమవుతుందని, మీరే దీనిని ప్రారంభిస్తారని ఆయనకు చెప్పాం. ఇంత తక్కువ సమయంలో ఈ పనిని పూర్తి చేయడం సాధ్యం కాదని మాకు తెలుసు’’ అని అన్నారు. ‘‘ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమోదం లభించలేదు. దీంతో విసిగిపోయాను. రైల్వే బోర్డు చైర్మన్ కాళ్లు పట్టుకున్నాను. ప్రాజెక్టుకు అనుమతి ఇస్తేనే కాళ్లను వదిలేస్తానని చెప్పాను. దీంతో చివరికి ఈ రైలు తయారీకి అనుమతి లభించింది.’’ అని చెప్పారు.

రాముడి కంటే రావణుడే గొప్పవాడు - బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ

‘‘ మా ప్రాజెక్టుకు ఆమోదం లభించిన వెంటనే టీమ్ అంతా దానిపై కసరత్తు ప్రారంభించాం. ఇది ఒక ప్రాజెక్ట్. కాబట్టి దానికి పేరు అవసరం అందుకే దానికి ‘ట్రైన్ 18’ అని పేరు పెట్టాం. విదేశాల్లో తయారు చేయడానికి మూడు సంవత్సరాలు పట్టే రైలును మేము 18 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో దానికి ఆ పేరు నిర్ణయించాం. చివరికి 18 నెలల్లో దానిని తయారు చేశాం. మా కష్టానికి ఫలితం లభించింది. తరువాత దానికి ‘వందే భారత్’ అని నామకరణం చేశారు.’’ అని సుధాంశు మణి గుర్తు చేసుకున్నారు. 

గర్ల్‌ఫ్రెండ్‌ను ఆమె భర్త దగ్గర నుంచి తెచ్చి తనకు అప్పగించాలని లవర్ పిటిషన్.. హైకోర్టు తీర్పు ఇదే

ఐసీఎఫ్ నుంచి తాను రిటైర్ అయ్యే సమయానికి రైలు బోగీల తయారీలో అతి పెద్దదైన కోచ్ ఫ్యాక్టరీ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిందని ఆయన తెలిపారు. వచ్చే నాలుగైదేళ్లలో భారతీయ రైల్వే ట్రాక్ లపై 300 వందేభారత్ రైళ్లు నడుస్తాయని మణి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో దేశీయంగా తయారైన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆన్బోర్డ్ వై-ఫై వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటిగా నిలిచింది.
 

click me!