Vaishno Devi Stampede: వైష్ణోదేవి ఆలయ విషాదానికి ఆదే కార‌ణ‌మా?.. అసలు ఏం జరిగింది?

By Mahesh RajamoniFirst Published Jan 1, 2022, 11:37 AM IST
Highlights

Vaishno Devi Stampede: దేశ‌వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర సంబురాలు జ‌రుగుతుండ‌గా జ‌మ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ‌మ్మూలోని వైష్ణోదేవి ఆల‌యం త్రికూఠ ప‌ర్వ‌తంపై ఉన్న కాంప్లెక్స్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో 12 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో  20 మంది గాయ‌ప‌డ్డారు. ఈ విషాద ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాలు చ‌ర్చ‌నీయాంశ‌మవుతున్నాయి. 
 

Vaishno Devi Stampede: దేశ‌వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర సంబురాలు జ‌రుగుతుండ‌గా జ‌మ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ‌మ్మూలోని వైష్ణోదేవి ఆల‌యం త్రికూఠ ప‌ర్వ‌తంపై ఉన్న కాంప్లెక్స్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో 12 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో  20 మంది గాయ‌ప‌డ్డారు. ఈ విషాద ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి అధిక సంఖ్య‌లో భ‌క్తులు రావ‌డ‌మేనా కార‌ణం?  లేదా భ‌క్తుల మ‌ధ్య ఏదైనా ఘ‌ర్ష‌ణ జ‌రిగిందా?  జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? అనే ప్ర‌శ్న‌లను ఇత‌ర భ‌క్తులు లేవ‌నెత్తుతున్నారు. అస‌లు ఏం జరిగింది? అనేదానిపై అనేక అనుమానాలు సైతం వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  వైష్ణ‌వ‌దేవీ భ‌వ‌న్‌కు అధిక సంఖ్య‌లో భ‌క్తులు చేరుకోవ‌డం.. ఈ  తొక్కిస‌లాటకు కార‌ణ‌మైంద‌ని భావిస్తున్నారు. అయితే, వైష్ణోదేవీ ద‌ర్శ‌నం కోసం అనుమ‌తి పాస్‌లు తీసుకోవ‌డానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో భ‌వ‌న్‌కు  వ‌చ్చార‌ని తెలుస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే  కిక్కిరిసిపోయిన భ‌క్తుల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లు జ‌మ్మూకాకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్ల‌డించారు.  దీని ఈ క్ర‌మంలోనే ప‌రిస్థితులు  మారి.. తొక్కిసలాట జ‌ర‌గానికి కార‌ణ‌మైంద‌ని అన్నారు.

Also Read: coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !

వైష్ణోదేవి ఆల‌యం త్రికూఠ ప‌ర్వ‌తంపై ఉన్న కాంప్లెక్స్ భ‌వ‌న్‌లోని మూడ‌వ నెంబ‌ర్ గేటు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్రకారం.. భ‌క్తులు ఆధికంగా రావ‌డంతో అక్కిడి ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ నేప‌థ్యంలోనే భ‌క్తుల మ‌ద్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే వారు ఒక‌రిని ఒక‌రు నెట్టువేసుకున్నారు. ఈ ప‌రిస్థితులు తొక్కిస‌లాటకు దారితీశాయి అని దిల్‌బాగ్ చెప్పారు. 2022 కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా దేవి ద‌ర్శ‌నం కోసం అత్య‌ధిక సంఖ్య‌లో త్రికూఠ ప‌ర్వ‌తానికి భ‌క్తులు చేరుకున్నారు. తెల్ల‌వారుజామున 2.45 నిమిషాల‌కు తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న గురించి తెలిసి యావ‌త్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. వైష్ణోదేవీ భవన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.  బాధితుల కుటుంబాలకు, బాధితులకు ఆయన సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్క‌రికి  ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అందిస్తామ‌ని తెలిపారు. అలాగే, ఈ ఘట‌న‌లో గాప‌డిన వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు. గాయ‌ప‌డ్డవారికి 50,000 ఆర్థిక సాయం అందించ‌నున్నారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి ద‌ర్యాప్తున‌కు జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు.

Also Read: R Value: దేశంలో క‌రోనా వైర‌స్ ఆర్‌-ఫ్యాక్టర్ ఆందోళ‌న !

ఇదిలావుండ‌గా, తొక్కిసలాట‌లో మ‌ర‌ణించిన 12 మందిలో 8 మందిని అధికారులు గుర్తించారు. మిగ‌తా న‌లుగురి పూర్తి వివ‌రాలు తెలియ‌లేద‌ని అధికారులు తెలిపారు. చ‌నిపోయాన వారిలో  దీర‌జ్ కుమార్‌, శ్వేతా సింగ్‌, విన‌య్ కుమార్‌, సోనూ పాండే, మ‌మ‌తా, ధ‌ర‌మ్‌వీర్ సింగ్‌, వ‌నీత్ కుమార్‌, అరుణ్ ప్ర‌తాప్ సింగ్‌లు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారిలో ఎక్కువ మంది ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక నారాయ‌ణ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌ర్వాత భ‌క్తుల‌ను ఖాళీ చేయించేందుకు పోలీసులు ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ వైష్ణోదేవి ద‌ర్శ‌నం ప్రారంభ‌మైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 

Also Read: క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ! 

 

Extremely saddened by the loss of lives due to a stampede at Mata Vaishno Devi Bhawan. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to JK LG Shri Ji, Ministers Shri Ji, Ji and took stock of the situation.

— Narendra Modi (@narendramodi)

Shri Mata Vaishno Devi Shrine Board Helpline nos:
01991-234804
01991-234053

Other Helpline nos:
PCR Katra 01991232010/ 9419145182
PCR Reasi 0199145076/ 9622856295
DC Office Reasi Control room
01991245763/ 9419839557

— Office of LG J&K (@OfficeOfLGJandK)
click me!