కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్.. చిన్న మిస్టేక్: అజ్జాతంలో వున్నా దొరికిపోయాడు

By Siva KodatiFirst Published Sep 6, 2020, 3:06 PM IST
Highlights

ప్రముఖుల హత్యలతో సహా 51 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గాను వేషం మార్చి పండ్లు అమ్ముకునే వాడిలా కొత్త అవతారం ఎత్తాడు

ప్రముఖుల హత్యలతో సహా 51 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గాను వేషం మార్చి పండ్లు అమ్ముకునే వాడిలా కొత్త అవతారం ఎత్తాడు.

అయితే స్నేహితుల కారణంగా పోలీసులకి దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆషు జాత్ (32) హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు వంటి 51 కేసుల్లో ప్రధాన నిందితుడు.

నోయిడాకు చెందిన ప్రముఖులు గౌరవ్, హపుర్, బీజేపీ నాయకుడు రాకేశ్ శర్మలను హత్య చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి మకాం మార్చాడు. అక్కడి పోలీసులకు చిక్కకుండా రోడ్ల  మీద పండ్లు అమ్ముకునే వాడిలా అవతారం ఎత్తాడు.

అయితే వేషం మార్చినా అతను పాత స్నేహితులతో సంబంధాలు తెంచుకోలేదు. ఈ క్రమంలో ఓ రోజు యూపీలోని అతడి స్నేహితుడికి ఫోన్ చేయడంతో ట్రాక్ చేసిన పోలీసులకు ఆషు గుట్టు తెలిసిపోయింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముంబై వెళ్లి ఆషుని అరెస్ట్ చేశారు. 

click me!