వారణాసిలో మోడీ రోడ్ షో.. కాశీ విశ్వనాథ ఆలయంలో ‘డమరుకం’ వాయిస్తూ ఫుల్ జోష్‌లో ప్రధాని

Siva Kodati |  
Published : Mar 04, 2022, 09:19 PM IST
వారణాసిలో మోడీ రోడ్ షో.. కాశీ విశ్వనాథ ఆలయంలో ‘డమరుకం’ వాయిస్తూ ఫుల్ జోష్‌లో ప్రధాని

సారాంశం

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉత్సాహపరుస్తూ డమరుకం వాయించారు. 

మార్చి 7న జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల (up assembly elections) చివరి దశ పోలింగ్‌కు ముందు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో (varanasi) ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) రోడ్‌షో (road show)నిర్వహించారు. నగరంలోని మాల్దాహియా ప్రాంతంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ పూలమాలలు వేసి ఆయన రోడ్ షో ప్రారంభించారు. ప్రధాని మోడీ కాన్వాయ్ నగరం గుండా వెళ్తుండగా.. బీజేపీ శ్రేణులు ‘జైశ్రీరామ్’ , ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ నినాదాలు చేశారు. దారి పొడవునా వారంతా గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఇదే సమయంలో డీజేలో ‘‘జో రామ్ కో లాయే హైం, హమ్ ఉంకో లాయేంగే’ అనే పాట ప్లే అవుతోంది. 

కాషాయ రంగు టోపీ, మెడలో ‘గంఛా’ (టవల్) కట్టుకున్న మోడీకి మద్ధతుగా నినాదాలు చేస్తూ పలువురు శంఖాలు ఊదుతూ కనిపించారు. రోడ్ షో సందర్భంగా.. పలువురు యువకులు, పిల్లలు బీజేపీ టోపీలు ధరించి మోడీకి మద్ధతు తెలిపారు. బీజేపీకి కంచుకోట అయిన వారణాసి సౌత్ నియోజకవర్గంలోని 3.5 కిలోమీటర్ల పాటు రోడ్ షో కవరైంది. ఇటీవల పునరుద్ధరించబడిన కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా శివయ్యకి ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ఆయన ‘‘డమరుకం’’ వాయిస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత అదే స్థలం నుంచి తన మొదటి రోడ్ షోను  మోడీ ప్రారంభించారు. 

కాశీ విశ్వనాథ్ కాంప్లెక్స్‌లో పూజల అనంతరం .. బెలారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి మోడీ పూలమాల వేసి నివాళుర్పించారు. వారణాసి పర్యటనలో భాగంగా డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యూ) గెస్ట్‌హౌస్‌లో ఈ రాత్రికి మోడీ బస చేస్తారని బీజేపీ నగర అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ తెలిపారు. రోహనియా అసెంబ్లీ స్థానం పరిధిలోని ఖజురియా గ్రామంలో జరిగే ర్యాలీతో ప్రధాని శనివారం తన యాత్రను ముగించనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలను ఉద్ధేశించి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని రాయ్ పేర్కొన్నారు. 

అంతకుముందు మిర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో (Ukraine) చిక్కుకుపోయిన విద్యార్థులతో సహా పౌరులందరినీ తీసుకురావడానికి భారత ప్రభుత్వం (govt of india) పగలు రాత్రి కృషి చేస్తోందని అన్నారు. 'ఆపరేషన్ గంగా'తో (operation ganga) ఉక్రెయిన్ నుంచి వేలాది మంది చిన్నారులను సురక్షితంగా తీసుకొచ్చామని చెప్పారు. కాగా.. ఏడు దశల యూపీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశలకు ఫిబ్రవరి 27.. మార్చి 3,7 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను మార్చి 10న ప్రకటించనుంది ఎన్నికల సంఘం. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!