Anti-Conversion Bill : మతమార్పిడి నిరోధక బిల్లుపై హర్యానా అసెంబ్లీలో రగడ..

Published : Mar 04, 2022, 05:19 PM IST
Anti-Conversion Bill : మతమార్పిడి నిరోధక బిల్లుపై హర్యానా అసెంబ్లీలో రగడ..

సారాంశం

హర్యానా అసెంబ్లీలో నేడు ప్రభుత్వం Anti-Conversion Bill ను ప్రవేశపెట్టింది. అయితే దీనిని ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు బిల్లు పత్రాలను చింపేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 

బలవంతపు మత మార్పిడులను నిరోదించేందుకు హర్యానా (harayana) అసెంబ్లీ (assmebly) లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై గందరగోళం నెలకొంది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో శుక్రవారం హర్యానా బడ్జెట్ సమావేశాలు ఆందోళ‌న‌ల మ‌ధ్య మొద‌ల‌య్యాయి. 

ఈ బిల్లుపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (harayana cm manoharlal kattar) మాట్లాడారు. తాము ఏ మతంపైనా వివక్ష చూపడం లేద‌ని స్ప‌ష్టం చేశారు. బలవంతపు మతమార్పిడుల గురించి మాత్రమే తాము మాట్లాడతామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ కూర్చొని ఉన్న శాసనసభ్యులను చూపిస్తూ “ ఈ బెంచీలపై కూర్చున్న వారందరూ వారు కోరుకున్న మతానికి వెళ్లొచ్చ‌ని, ఇందులో అభ్యంత‌రం ఏమీ లేదు‘‘ అని తెలిపారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ సింగ్ కడియన్‌ (congress mla raghuveer singh cadiyan)ను సస్పెండ్ చేయడంతో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు శాసనసభ్యులకు మింగుడుపడలేదు. ఆ ఎమ్మెల్యే Anti-Conversion Bill  ప్ర‌తుల‌ను చింపివేయ‌డంతో ఆయ‌న‌ను సస్పెండ్ చేశారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ శాసనసభ్యులు నిరసనలు కొనసాగించారు.

బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కడియన్‌ను సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ జియాన్ చంద్ గుప్తా (speaker jayan chand gupta) పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అయితే బిల్లును ఇంకా సభలో ప్రవేశపెట్టనందున దాని కాపీని చించివేసే హక్కు తనకు ఉందని ఆయ‌న చెప్పారు. “ నేను స్పీకర్ భావాలను గౌరవిస్తాను. కానీ నేను చేసిన ప‌నికి చింతించ‌డం లేదు. ఎందుకంటే నేను ఒక సాధారణ కాగితాన్ని మాత్రమే చించాను. నేను ఇక్క‌డే మూడు వ్య‌వసాయ చట్టాల కాపీలను కూడా చించివేశాను ’’ అని ఆయ‌న తెలిపారు. అయితే సభలో కాగితాలు చింపివేయ‌డం ఆమోదయోగ్యం కాదని స్పీకర్ చెప్పారు. “ బిల్లు మీకు చెత్త ముక్క కావచ్చు, కానీ సభకు కాదు. సభల తీరును కాపాడుకోవడం నా కర్తవ్యం.” అని స్పీక‌ర్ అన్నారు. 

గతేడాది కర్నాటక  అసెంబ్లీ (karnataka assembly) లో కూడా ఇలాంటి Anti-Conversion Bill ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లు ప్ర‌వేశపెట్టిన స‌మ‌యంలో ప్ర‌తిపక్ష నాయ‌కులు కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ (congress) స‌భ్యులు బిల్లు ప్ర‌తుల‌ను చింపేశారు. ఇది మైనారిటీ వ‌ర్గాల‌ను టార్గెట్ చేసేలా ఉంద‌ని ఆరోపించారు. కానీ క‌ర్నాట‌క ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యంపైనే నిల‌బ‌డింది. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మధ్య ఎట్ట‌కేల‌కు మూజు వాణి ఓటుతో అసెంబ్లీ బిల్లును గ‌తేడాది డిసెంబ‌ర్ (december) నెల‌లో ఆమోదించింది. 

ఈ బిల్లు ప్ర‌కారం.. ఎవ‌రినీ బ‌లవంతంగా మ‌తం మార్చ‌డానికి వీలు లేదు. అంటే ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం గానీ, బ‌లవంతం చేసి గానీ, ఇత‌ర మోస‌పూరిత ప్ర‌య‌త్నాల ద్వారా మ‌తం మార్చ‌డం చ‌ట్ట ప్ర‌కారం నేరం. ఇలా చేస్తే శిక్ష‌లు విధించే అవ‌కాశం చ‌ట్టానికి ఉంటుంది. ఐదేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష విధింవ‌చ్చు. దీంతో పాటు రూ. 50 వేల ఫైన్ కూడా వేయ‌వ‌చ్చు. 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!