పగతీర్చుకోవడానికి కన్న బిడ్డనే చంపేశాడు.. ప్రత్యర్థులపై కేసు పెట్టాడు.. కానీ..!

Published : Sep 26, 2021, 05:24 PM IST
పగతీర్చుకోవడానికి కన్న బిడ్డనే చంపేశాడు.. ప్రత్యర్థులపై కేసు పెట్టాడు.. కానీ..!

సారాంశం

తాను పగపెంచుకున్నవారిని ఎలాగైనా కటకటాల్లోకి పంపాలని నిర్ణయించిన ఓ వ్యక్తికి కన్న కూతురినే గొడ్డలితో నరికి చంపాడు. తన శత్రువులే కూతురిని చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. ఇంటరాగేషన్‌లో తానే ఈ హత్యకు పాల్పడినట్టు మరణించిన బాలిక తండ్రి అంగీకరించాడు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)కు చెందిన ఓ వ్యక్తి తన శత్రువులపై పగ తీర్చుకోవడానికి ఓ పథకం ఆలోచించి అందులో కన్న కూతురి(Daughter)నే కడతేర్చాడు(kill). కన్న కూతరినే చంపేసి అది తన ప్రత్యర్థుల పని అని కేసు పెట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, దర్యాప్తులో తండ్రే అసలు నిందితుడని తేలింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సి జిల్లాలో బబ్లూ ప్రజాపతి తన 13ఏళ్ల కూతురు మాయను ఓ నది సమీపానికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రత్యర్థులే చేతిలోని గొడ్డలి తీసుకుని చంపడానికి వచ్చాడని ఆరోపించాడు. వారి నుంచి తాను బయటపడ్డా.. తన కూతురు మరణించిందని అన్నాడు. పోలీసులు ఆయన ఫిర్యాదును నమ్మి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కానీ, కేసులో కనిపించిన రుజువులు.. బబ్లూ చెప్పిన మాటలకు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి. ఆయననే ఇంటరాగేట్ చేయగా విషయం వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు.

బబ్లూ కొంతకాలం ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమె ఇటీవలే ఆ సంబంధం నుంచి విరమించుకుంది. అలాగే, బబ్లూ ఇటీవలే తన సోదరుడికి రూ. 30వేలు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. వీరిరువురిపైనా బబ్లూ కోపం పెంచుకున్నాడు. వీరిద్దరు సహా మరో ఏడుగురిపై బబ్లూ కేసు పెట్టాడు. ఆ తొమ్మిది మంది కలిసి తన కూతురిని చంపారని ఫిర్యాదు చేశాడు. కానీ, చివరికి పోలీసుల దర్యాప్తు తానే తన కూతురిని చంపేశానని ఒప్పుకున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu