505 హామీలు.. నాలుగు నెలల్లోనే 202 నెరవేర్చాం: సీఎం స్టాలిన్

By Siva KodatiFirst Published Sep 26, 2021, 3:12 PM IST
Highlights

ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోనే తాము ఎంతో చేశామని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. డీఎంకే పార్టీ ఎన్నికల్లో మొత్తం 505 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లో వీటిలో 202 హామీలు నెరవేర్చామని సీఎం తెలిపారు. ఈ మేరకు వివరాలు చెబుతూ ట్విట్టర్‌లో వీడియో సందేశం షేర్ చేశారు. 
 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో దేశాన్ని ఆకర్షిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇటీవల నిర్వహించిన సర్వేలో ది బెస్ట్ సీఎంగా నిలిచారు. అదే సమయంలో స్టాలిన్‌ను చూసి దేశంలోని రాజకీయ నాయకులు నేర్చుకోవాలని పవర్  స్టార్ పవన్ కల్యాణ్ సహా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియా ముందుకు వచ్చిన స్టాలిన్.. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోనే తాము ఎంతో చేశామని స్టాలిన్ అన్నారు. తను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడే అతి ముఖ్యమైన 5 బిల్లులపై సంతకాలు చేశానని ఆయన చెప్పారు. వాటిలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు దారులందరికీ రూ. 4 వేల కరోనా సహకారం అందించడం కూడా ఒకటని తెలియజేశారు.

డీఎంకే పార్టీ ఎన్నికల్లో మొత్తం 505 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లో వీటిలో 202 హామీలు నెరవేర్చామని సీఎం తెలిపారు. ఈ మేరకు వివరాలు చెబుతూ ట్విట్టర్‌లో వీడియో సందేశం షేర్ చేశారు. భారతదేశంలో మరే ప్రభుత్వమూ ఇంత వేగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను కలుస్తానని ఆయన అన్నారు. ప్రజలకు అత్యున్నత సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

 

சொன்னதைச் செய்திருக்கிறோம்! https://t.co/Sk5PwilIvs

— M.K.Stalin (@mkstalin)
click me!