డిజిటల్ సాక్ష్యాలంటే ఏమిటి? న్యాయ వ్యవస్థలో వీటి పాత్ర ఎంత?

Published : Aug 19, 2025, 11:48 PM IST
డిజిటల్ సాక్ష్యాలంటే ఏమిటి? న్యాయ వ్యవస్థలో వీటి పాత్ర ఎంత?

సారాంశం

యూపీ డిజిటల్ సాక్ష్యాలను గుర్తించడానికి, వీడియో కాన్ఫరెన్సింగ్‌ను విస్తరించడానికి, న్యాయ సంస్కరణలను వేగవంతం చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మిస్తోంది. దీనిగురించి రిటైర్డ్ జస్టిస్ తల్వంత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

లక్నో: న్యాయపరమైన కేసులలో డిజిటల్ సాక్ష్యాలు కీలక పాత్ర పోషిస్తాయి.. ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు ఇవి ఇంకా కీలకమవుతాయి. 26/11 ముంబై దాడుల కేసులో కసబ్‌కు శిక్ష పడటంలో ఇంటర్నెట్ ట్రాన్స్క్రిప్ట్‌లు కీలకంగా మారిన విషయం తెలిసిందే. న్యాయపరమైన విషయాల్లో డిజిటల్ సాక్ష్యాల ప్రాముఖ్యతపై యూపీఎస్ఐఎఫ్ఎస్ సెమినార్‌లో రిటైర్డ్ జస్టిస్ తల్వంత్ సింగ్ మాట్లాడుతూ… నేడు డిజిటల్ సాక్ష్యాలు న్యాయపరమైన కేసులలో కీలకమైనవి మాత్రమే కాకుండా న్యాయ ప్రక్రియలలో పారదర్శకత, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో కూడా కీలకమని నొక్కిచెప్పారు.

సెమినార్ సందర్భంగా రాష్ట్రంలో న్యాయ సంస్కరణలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని జస్టిస్ తల్వంత్ సింగ్ చెప్పారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో న్యాయవ్యవస్థను సాంకేతిక విధానంతో బలోపేతం చేస్తున్నారని… డిజిటల్ సాక్ష్యాలకు గుర్తింపునివ్వడానికి రాష్ట్రంలో అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర న్యాయస్థానాల పనితీరులో పారదర్శకత, వేగాన్ని తీసుకురావడానికి వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను విస్తరించారు. అదనంగా రాష్ట్ర న్యాయ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి, న్యాయ ప్రక్రియలు మరింత వేగంగా, పారదర్శకంగా జరిగేలా సీఎం యోగి అనేక సంస్కరణలను ప్రకటించారు.

ఈ సెమినార్ ఉత్తరప్రదేశ్ న్యాయ సంస్కరణలలో వేగవంతమైన పురోగతికి నిదర్శనమని అన్నారు. డిజిటల్ సాక్ష్యాలను నిర్వచించిన ఆయన పెరుగుతున్న సైబర్ నేరాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఇవి అవసరమని ఆయన అభివర్ణించారు. డిజిటల్ సాక్ష్యాలు ఇప్పుడు దాదాపు ప్రతి దర్యాప్తులో అంతర్భాగంగా మారాయన్నారు. "నా దృష్టిలో శాస్త్రీయ, డిజిటల్ సాక్ష్యాలు ప్రాసిక్యూషన్ కేసును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా శిక్ష విధించడంలో సహాయపడతాయి" అని జస్టిస్ తల్వంత్ సింగ్ పేర్కొన్నారు.

  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే