యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యల్లో నిజమెంత? అలెగ్జాండర్‌ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడా?

By telugu teamFirst Published Nov 15, 2021, 5:33 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పుంజుకుంటున్నది. ఈ ప్రచారంలో చారిత్రక ఘట్టాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మొన్నటి వరకు జిన్నా చుట్టూ రాజకీయం నడవగా ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యానాథ్ చంద్రగుప్త మౌర్యుడినీ ప్రస్తావించారు. చంద్రగుప్త మౌర్యుడి చేతిలో మరణించిన అలెగ్జాండర్‌ను ది గ్రేట్ అన్నారు గానీ, చంద్రగుప్తుడికి ఆ గుర్తింపు దక్కలేదని, చరిత్రకారులు మౌనం వహించి దేశానికి ద్రోహం చేశారని వాదించారు. ఈ నేపథ్యంలోనే చంద్రగుప్తుడు నిజంగా అలెగ్జాండర్‌ను ఓడించాడా? అనే అంశం చర్చకు వస్తున్నది.
 

న్యూఢిల్లీ: Uttar Pradesh Assembly Electionsకు ప్రచారం వేడెక్కుతున్నది. ముఖ్యంగా ఈ సారి ప్రచారం చరిత్ర ప్రధానంగా జరుగుతున్నది. ఒక పార్టీపై మరో పార్టీ నేతలు చరిత్ర పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకుని అటాక్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మొహమ్మద్ అలీ జిన్నా చుట్టూ వాఖ్యలు రాజుకోగా.. ఇప్పుడు మరింత చరిత్రలోకి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ సీఎం Chandragupta మౌర్యుడిని ప్రస్తావిస్తూ దాడి చేశారు. చరిత్రను వక్రీకరించారని, నిజమైన చక్రవర్తులకు పేరు రాలేదని, ఈ వివక్షపైనా చరిత్రకారులు మౌనం దాల్చారని అన్నారు.

అశోక చక్రవర్తి.. లేదా చంద్రగుప్త మౌర్యుడిని గ్రేట్ అని చరిత్ర పేర్కొనలేదని, కానీ, చంద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన Alexanderను మాత్రం గ్రేట్ అని కీర్తించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath అన్నారు. ఈ పక్షపాతంపై చరిత్రకారులూ మౌనం వహించారని తెలిపారు. కానీ, ప్రజలు ఇలాంటి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత దేశం తప్పకుండా మారుతుందని చెప్పారు. సీఎం యోగి వ్యాఖ్యలపై ఖండనలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రతిదాడి చేశారు. అంతేకాదు, దేశ విభజనను సమర్థించేవారు తాలిబాన్లకూ మద్దతు ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు చేశారు.

Also Read: జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’

హిందూత్వ అనేది అసత్య చరిత్రను సృష్టించే పరిశ్రమ అని అసదుద్దీన్ అన్నారు. చంద్రగుప్తుడు, అలెగ్జాండర్‌లు యుద్ధం చేసే అవకాశమే లేదని తెలిపారు. మన విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న డిమాండ్‌కు ఇది సరైన ఉదాహరణ అని వివరించారు. మంచి పాఠశాల విద్య లేకుండా బాబాలు వారికి అనుకూలంగా చెప్పిన కథలే చలామణి అవుతాయని చెప్పారు. బాబాలు విద్య విలువను ఖాతరు చేయరని విమర్శించారు. ఈ ఇద్దరి వాగ్వాదాన్ని పక్కన పెడితే.. నిజంగానే చంద్రగుప్త మౌర్యుడు.. అలెగ్జాండర్‌ను ఓడించాడా? అనే అంశాన్ని పరిశీలిద్దాం.

గ్రీకు ఆక్రమణదారుడు అలెగ్జాండర్ ది గ్రేట్‌కు చంద్రగుప్త మౌర్యుడు కలుసుకునే అవకాశం లేదని చరిత్ర చెబుతున్నది. వీరిద్దరు కలిశారని వాదించడానికి స్పష్టమైన ఆధారలు లేవు. ఎందుకంటే అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం 323లో మరణించాడు. కాగా, దీనికి రెండేళ్ల తర్వాత చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తిగా ప్రాముఖ్యతను సంపాదించుకున్నాడు. కాకపోతే కొన్ని వృత్తాంతాలు వీరిద్దరు కలిసినట్టు ఉన్నాయి. అవి వృత్తాంతాలు మాత్రమే.. వాటికి సరైన ఆధారాలు లేవు. ఓ సైనిక శిబిరంలో అలెగ్జాండర్‌ను చంద్రగుప్తుడు కలిసినట్టు కొన్ని వృత్తాంతాలు ఉన్నా.. ఆధారాలు తక్కువ అని చరిత్రకారుల అభిప్రాయం. 

Also Read: చరిత్ర చిక్కుముడి విప్పిన మున్సిపల్ ఇంజినీర్.. ఔరంగజేబు చంపిన షా జహాన్ కొడుకు దారాషుకో సమాధి జాడ

అయితే, అలెగ్జాండర్ మరణించిన తర్వాత పర్షియా నుంచి సింధు లోయ, నేటి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉన్న ఆయన సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు విభజించారు. తూర్పు భాగంలోని రాజ్యానికి ఆయన జనరల్ సెల్యూకస్ నికేటర్ బాధ్యతులు తీసుకున్నారు. మౌర్య రాజు చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్‌తో పోరాడారు. క్రీస్తు పూర్వం 305లో వీరిమధ్య యుద్ధం జరిగింది. ఇందులో చంద్రగుప్తుడు విజయం సాధించాడు. కాబూల్, కాందహార్ సహా పలు ప్రాంతాలను చంద్రగుప్తుడు సాధించుకున్నాడు. అంతేకాదు, వివాహ ఒప్పందమూ వీరి మధ్య కుదిరినట్టు చెబుతారు. సెల్యూకస్ నికేటర్ కూతురిని చంద్రగుప్తుడు వివాహమాడినట్టు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

click me!