సివిల్స్ రాసే మహిళా అభ్యర్థులకు గుడ్‎న్యూస్.. ప్రిలిమ్స్ పాసైతే లక్ష రూపాయల ప్రోత్సాహకం.. ఎక్కడంటే..

By team teluguFirst Published Nov 15, 2021, 4:17 PM IST
Highlights

సివిల్ సర్వీస్ పరీక్షలకు (civil service examinations) సిద్దమవుతున్న మహిళా అభ్యర్థులకు బిహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జనరల్ కేటగిరీ మహిళా అభ్యర్థులకు లక్ష రూపాయలు ప్రోత్సహకంగా (1 lakh as an incentive) ఇస్తామని తెలిపింది.
 

సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్దమవుతున్న మహిళా అభ్యర్థులకు బిహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీస్‌కు (civil service examinations) చెందిన ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జనరల్ కేటగిరీ మహిళా అభ్యర్థులకు లక్ష రూపాయలు ప్రోత్సహకంగా (1 lakh as an incentive) ఇస్తామని ప్రకటించింది. ప్రిలిమ్స్ సాధించిన అభ్యర్థులు ఈ మొత్తంతో మెయిన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడుతుందని బీహార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. 

ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా శిశు అభివృద్ధి సంస్థ.. మహిళా అభ్యర్థులకు మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు ఈ మొత్తాన్ని అందజేస్తుందని ఒక అధికారి తెలిపారు. గతంలో సివిల్ సర్వీస్ ప్రోత్సాహక పథకాల కింద ఆర్థిక సహాయం పొందని మహిళలకు ఈ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు‌గా చెప్పారు. 

‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో బీహార్ మహిళల పనితీరును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2021లో నిర్వహించిన యూపీఎస్సీ లేదా బీపీఎస్సీ (UPSC or BPSC) ప్రిలిమినరీ పరీక్షల్లో విజయం సాధించిన మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని డబ్ల్యుసిడిసి మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ బమ్హారా (Harjot Kaur Bamhara) విలేకరులకు తెలిపారు.

‘గతంలో షెడ్యూల్డ్ కులాలు (Scheduled Castes), షెడ్యూల్డ్ తెగలు (Scheduled Tribes) , ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మిగిలిన మహిళా అభ్యర్థులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. డిసెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం, మొత్తం లక్ష రూపాయలను చెల్లించడం జరుగుతుంది. తద్వారా మహిళా అభ్యర్థులు మెయిన్స్‌ ఎగ్జామ్‌కు సన్నద్ధమవుతున్నప్పుడు సమస్యలను ఎదుర్కొకుండా చూడవచ్చు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని అభ్యర్థి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.’ అని ఆమె చెప్పారు.

click me!