ఏళ్లుగా రాజకీయాలకే వాడుకున్నారు : మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 20, 2023, 06:29 PM IST
ఏళ్లుగా రాజకీయాలకే వాడుకున్నారు : మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా వ్యాఖ్యలు

సారాంశం

మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్‌లో వుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొన్ని రాజకీయ పార్టీలు పదే పదే రాజకీయం చేశాయని ఆయన దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం రాకతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించిందని అమిత్ షా స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్‌లో వుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆయన బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. బిల్లుతో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని అమిత్ షా చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయాల కోసం వాడుకున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు పదే పదే రాజకీయం చేశాయని ఆయన దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం రాకతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించిందని అమిత్ షా స్పష్టం చేశారు. మీకు రాజకీయం ముఖ్యం, మాకు మహిళా సాధికారత ముఖ్యమని అమిత్ షా విపక్షాలకు చురకలంటించారు. భేటీ బచావో, భేటీ పడావో అన్నది మా నినాదమని హోంమంత్రి స్పష్టం చేశారు.

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం: అసదుద్దీన్ ఓవైసీ

అంతకుముందు ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా వుందన్నారు. మహిళా బిల్లుపై బీజేపీ అందరినీ తప్పుదారి పట్టిస్తోందని.. ఈ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్లను ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కులగణన చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ఓబీసీ వర్గాల పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని.. ఇప్పుడున్న వ్యవస్థల్లో ఓబీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి మారుతుంటే రాష్ట్రపతిని ఆహ్వానించలేదని ఆయన దుయ్యబట్టారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు