కేంద్ర బడ్జెట్ కు కేంద్ర మంత్రి వర్గం గురువారం నాడు ఆమోదం తెలిపింది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
న్యూఢిల్లీ:కేంద్ర మంత్రివర్గం గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర బడ్జెట్ 2024 కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్ కు చేరుకొన్నారుకేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతిని తీసుకున్నారు కేంద్ర మంత్రి. రాష్ట్రపతి భవన్ నుండి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
also read:Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారు?
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ కు మధ్యంతర బడ్జెట్ ను సమర్పించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ కు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టనుంది.ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో దఫా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.