UNESCO: భగవద్గీతకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కోలో చోటు

Published : Apr 18, 2025, 12:50 PM IST
UNESCO: భగవద్గీతకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కోలో చోటు

సారాంశం

భగవద్గీతకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో నిర్వహించే మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీతకు చోటు దక్కింది. అలాగే భారత ప్రాచీన నాట్యకళకు మౌలిక గ్రంథంగా పరిగణించే భరతముని రచన "నాట్య శాస్త్రం" కూడా ఇదే జాబితాలో చేరింది. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా  ఓ పోస్ట్ చేశారు..   

భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందని, ఈ రచనలు మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు. యునెస్కో రిజిస్టర్ లో చోటు దక్కించుకున్నాయి’ అని రాసుకొచ్చారు. 

ఈ ట్వీట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "ఈ ఘనత ప్రతీ భారతీయుడి గుండెను గర్వంతో నింపుతుంది. భగవద్గీత, నాట్యశాస్త్రం వంటి మహాగ్రంథాలు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చేరడం, మన పురాతన విజ్ఞానానికి, భారతీయ నాగరికత గొప్పతనానికి ప్రపంచం తరఫున లభించిన విశిష్ట గుర్తింపు. భగవద్గీత లోని ఆధ్యాత్మికత, నాట్యశాస్త్రం లోని కళాత్మకత మన నాగరికతను శతాబ్దాలుగా గమనింపజేస్తూ, ప్రేరణనిస్తూనే ఉన్నాయి." అని రాసుకొచ్చారు. 

 

భగవద్గీత మన జీవన విధానంలో  ఒక భాగమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు గీతలో సమాధానం ఉంటుందని చెబుతుంటారు. యుద్ధరంగంలో కావాల్సిన వాళ్లంతా చనిపోతున్న సమయంలో ఢీలా పడ్డ అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనే భగద్గీత. ఇందులో 18 అధ్యయాలు ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !