కడుపులో దాచి కొకైన్ స్మగ్లింగ్.. బయటపడ్డ 91 క్యాప్సూల్స్ , ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న కస్టమ్స్

By Siva KodatiFirst Published Dec 29, 2021, 4:57 PM IST
Highlights

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (indira gandhi international airport) మరోసారి డ్రగ్స్‌ను (drugs) పట్టుకున్నారు కస్టమ్స్ (customs) అధికారులు. క్యాప్సూల్స్‌లో కొకైన్ పెట్టి.. కడుపులో దాచిన ఉగాండా దేశస్తురాలిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.14 కోట్లు వుంటుందని చెబుతున్నారు. 

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (indira gandhi international airport) మరోసారి డ్రగ్స్‌ను (drugs) పట్టుకున్నారు కస్టమ్స్ (customs) అధికారులు. క్యాప్సూల్స్‌లో కొకైన్ పెట్టి.. కడుపులో దాచిన ఉగాండా దేశస్తురాలిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.14 కోట్లు వుంటుందని చెబుతున్నారు. ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలు అనుమానాస్పదంగా కనిపించడంతో... ఆమెను ప్రశ్నించి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో క్యాప్సూల్స్ రూపంలో ఉన్న కొకైన్‌ను సదరు మహిళ కడుపులో (cocaine capsules) దాచి భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 91 కొకైన్‌ క్యాప్సుల్స్‌ని మహిళ మింగినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 

Also Read:ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 14 కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఉగాండాకు చెందిన మహిళ బ్యాగ్‌లో..

కాగా.. గత నెలలో కూడా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్ పట్టుబడింది. అడిస్ అబాబా నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ విలువ సుమారు రూ. 6 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా . ఇతడు టాంజానియా జాతీయుడిగా గుర్తించారు. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. మాములు కొరియర్ ప్యాకింగ్‌లో కొకైన్ పౌడర్‌ను అతను స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు

click me!