మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కొత్త కూటమి.. బీఆర్ అంబేద్కర్ మనవడి పార్టీతో అలయెన్స్.. కాంగ్రెస్, ఎన్సీపీ కూడానా?

By Mahesh KFirst Published Jan 23, 2023, 2:31 PM IST
Highlights

మహారాష్ట్రలో ముంబయి సివిక్ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే కీలక ప్రకటన చేశారు. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాదీతో పొత్తును ప్రకటించారు. ఈ కూటమిలో చేరడానికి కాంగ్రెస్, ఎన్సీపీతోనూ చర్చలు జరిగినట్టు తెలుస్తున్నది.
 

ముంబయి: మహారాష్ట్రలో గతేడాది శివసేన పార్టీలో నిలువునా చీలిపోయి ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసింది. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీలో చీలిక తెచ్చి తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఎన్నికలేవీ రాష్ట్రంలో జరుగలేవు. కానీ, త్వరలోనే ముంబయి సివిక్ పోల్స్ దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ తాజాగా, సంచలన ప్రకటన చేసింది. ఉద్ధవ్ ఠాక్రే కొత్త కూటమిపై ప్రకటన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పార్టీతో చేతులు కలుపుతున్నట్టు ప్రకటించారు. ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాదీతో కలిసి పురపాలిక ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. 

గత రెండు మాసాలుగా ఉద్ధవ్ ఠాక్రే.. ప్రకాశ్ అంబేద్కర్‌తో సమావేశాలు అవుతున్నారు. తాజాగా, ఈ రోజు వీరిద్దరి కూటమిని ప్రకటించారు. అలయెన్స్ గురించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ‘ఈ రోజు జనవరి 23వ తేదీ. అంటే..బాలా సాహెబ్ ఠాక్రే జయంతి. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు తమ పార్టీలు రెండూ ఒక తాటిమీదకు రావాలని కోరుకుంటున్నారు. ఇది తమకు సంతోషదాయకంగా ఉన్నది. ప్రకాశ్ అంబేద్కర్, తాను ఈ రోజు కూటమి కోసం ఇక్కడ కలుసుకున్నాం’ అని వివరించారు. 

Also Read: మహారాష్ట్రలో మరో కూటమికి ఛాన్స్.. బీజేపీకి బ్రేకులు వేయడానికి ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్‌లు ఏకతాటిపైకి..

‘మా తాత, ప్రకాశ్ అంబేద్కర్ తాత కొలీగ్స్. సామాజిక సమస్యలపై వారిద్దరూ పోరాడారు. ఠాక్రే, అంబేద్కర్‌లకు చరిత్ర ఉన్నది. ఇప్పుడు వారి భావి తరాలైన మేం దేశంలోని ప్రస్తుత సమస్యలపై పోరాడటానికి ముందుకు వచ్చాం’ అని తెలిపారు.

ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ, ఇది దేశంలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ‘సామాజిక సమస్యలపై మేం నిరసనలు చేశాం. సామాజిక సమస్యలపై తాము గెలువాలా? లేదా? అనేది ఓటర్ల చేతిలో ఉన్నది. కానీ, అలాంటి ప్రజలకు పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వడం రాజకీయ పార్టీల చేతిలో ఉన్నది’ అని అన్నారు.

ఇప్పటి వరకు తాము ఇద్దరమే. తమ కూటమిలో కలవడంపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శరద్ పవార్ కూడా తమ కూటమిలో చేరుతారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

click me!