ముంబైలో విషాదం.. 24 అంతస్తుల భవనం శిధిలాలు పడి.. 8యేళ్ల బాలిక మృతి...

By SumaBala BukkaFirst Published Jan 23, 2023, 2:07 PM IST
Highlights

కూలుతున్న భవనం శిధిలాలు మీదపడి ఓ ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 

ముంబై : భవనం శిధిలాలు కూలి గాయపడిన ఓ ఎనిమిదేళ్ల బాలిక చికిత్స పొందుతూ మరణించింది. గ్రౌండ్ ప్లస్-24 అంతస్థుల భవనంలోని ఓ ప్లాస్టర్ ముక్క ఆమెపై పడటంతో గాయపడిన ఎనిమిదేళ్ల బాలిక సోమవారం తెల్లవారుజామున దక్షిణ ముంబైలోని ఆసుపత్రిలో మరణించినట్లు అధికారి తెలిపారు. చందన్‌వాడిలోని శ్రీకాంత్ పాలేకర్ రోడ్‌లోని శ్రీపతి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

"బాలిక పేరు క్రిషా పటేల్, ప్లాస్టర్ ముక్క ఆమెపై పడటంతో గాయపడింది. వెంటనే ఆమెను గిర్గావ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఐసియులో తెల్లవారుజామున 1:30 గంటలకు మరణించింది" అని చెప్పారు. అగ్నిమాపక దళం శిథిలాలను తొలగించింది. ముందుజాగ్రత్త చర్యగా  భవనాన్ని చుట్టుముట్టింది. ఈ ఘటనపై వీపీ రోడ్డు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

‘ఆ అమ్మాయితో, అప్పుడే నా పెళ్లి...’ వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో...

ఇదిలా ఉండగా, జనవరి 19 ఉదయం ముంబై-గోవా హైవేపై కారు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హైవేపై మాంగావ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ట్రక్కు ముంబైకి వెళ్తుండగా, కారు రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళుతోంది. ముక్కలు చెక్కలైన కారు అవశేషాలు ప్రమాదం ఎంత తీవ్రతంగా జరిగిందో సూచిస్తున్నాయి. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. హైవేపై ట్రాఫిక్ నిలిచిపోకుండా క్లియర్ చేసి.. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!