ప్రభుత్వానికి ప్రజలు భయపడుతున్నారంటే.. అక్కడ నియంతృత్వం ఉన్నట్టే: కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Jan 23, 2023, 1:47 PM IST
Highlights

కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి, దాని ఏజెంట్లకు ప్రజలు భయపడుతున్నారంటే అక్కడ నియంతృత్వం ఉన్నట్టే అని, అదే ప్రజలకే ప్రభుత్వం భయపడితే అక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు అని వివరించింది. పోలీసులు మ్యాన్‌హ్యాండ్లింగ్ చేశారని 23 ఏళ్ల అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్ విచారించి వెలువరించిన తీర్పులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు పొందుపరిచింది.
 

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు ఓ పిటిషన్ విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి గాని, దాని ఏజెంట్లకు గాని ప్రజలు భయపడటం మొదలైందంటే అక్కడ నియంతృత్వం మొదలైనట్టే అని పేర్కొంది. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 23 ఏళ్ల అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు మ్యాన్‌హ్యాండ్లింగ్ చేశారని ఆ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు.

‘ప్రభుత్వం లేదా దానికి లోబడి పని చేసే ఏజెంట్లు ప్రజలకు భయపడుతున్నాయంటే అక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు; కానీ, ఎఫ్పుడైతే ప్రజలే ప్రభుత్వానికి లేదా దాని ఏజెంట్లకు భయపడతారో అక్కడ నియంతృత్వం ఉన్నట్టే’ అని జస్టిస్ ఎం నాగప్రసన్న పేర్కొన్నారు. అంతేకాదు, పోలీసు అధికారుల నుంచి రూ. 3 లక్షల పరిహారం అతడికి అందించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని దోషుల నుంచి రికవరీ చేయాలని సూచించింది.

బేల్తంగడిలోని పుథిలా గ్రామానికి చెందిన అడ్వకేట్ కుల్దీప్.. ఎస్ఐ సుతేష్ కేపీపై పిటిషన్ ఇచ్చారు. కానీ, పోలీసులు కేసు నమోదు చేయలేదు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం వహించారు. ఆ తర్వాత అతను ఎస్ఐ సుతేష్ కేపీకి వ్యతిరేకంగా హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు.

Also Read: గోవధ ఆపేస్తే భూమి పై ఉన్న అన్ని సమస్యలు సమసి పోతాయి.. ఆవు పేడ అటామిక్ రేడియేషన్‌ను అడ్డుకుంటుంది: గుజరాత్ కోర్టు సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే తీర్పు వెలువరించిన హైకోర్టు సుతేష్ పై శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ, ఐజీలను ఆదేశించింది. అతనికి సహకరించిన ఇతర అధికారులు ఉంటే వారినీ గుర్తించాలని సూచించింది. మూడు నెలల్లో ఆ ఎంక్వైరీ పూర్తవ్వాలని పేర్కొంది.

కుల్దీప్ తన సాగు భూమిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునేలా పొరుగువారు కే వసంత గౌడ, ఆయన భార్య భవానీ గేటు నిర్మించకుండా రిస్ట్రెయినింగ్ ఆర్డర్‌ కూడా అడ్వకేట్ పొందారు.

కోర్టు మద్యంతర ఆదేశాల పై పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. కుల్దీప్ ఫిర్యాదునూ క్లోజ్ చేశారు. అదే రోజు అంటే 2022 డిసెంబర్ 2న కుల్దీప్ అక్రమంగా తమ భూమిలోకి వస్తున్నాడని, గేట్ దొంగిలించాడని భవానీ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు రిజిస్టర్ చేశారు. ఈ కేసు లో పోలీసుల కుల్దీప్ పై చేయి చేసుకున్నారు. కేసు ఫైల్ కావడానికి ముందే ఇంటికి వచ్చి కనీసం షర్ట్ వేసుకునే వీలు కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు. టార్చర్ పెట్టారు. ఈ విషయాలను అడ్వకేట్ కోర్టు లో వినిపించారు. 

click me!