Fact Check: పాకిస్థానీ పైలట్లను భారత సైన్యం పట్టుకుందా?

Published : May 08, 2025, 11:44 PM ISTUpdated : May 09, 2025, 09:38 AM IST
Fact Check:  పాకిస్థానీ పైలట్లను భారత సైన్యం పట్టుకుందా?

సారాంశం

India-Pakistan Border Tensions: భారత సైన్యం ఇద్దరు పాకిస్థానీ  యుద్ధ విమానం పైలట్లను జైసల్మేర్, అఖ్నూర్‌లలో పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత? 

India-Pakistan Border Tensions: మీడియా కథనాల ప్రకారం, రాజస్థాన్‌లోని జైసల్మేర్, అఖ్నూర్‌లలో ఇద్దరు పాకిస్థానీ యుద్ధ విమానం పైలట్లను భారత సైన్యం బంధించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు భారత ఆర్మీ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం పైలట్లను పట్టుకున్నట్లు వీడియోలను కూడా ప్రదర్శించాయి. అధికారిక ప్రకటన వెలువడితేగాని  భారత ఆర్మీ చేతిలో పాక్ పైలట్లు బంధీలుగా ఉన్నది? లేనిది? తేలుతుంది. 

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ భారత్ పై దాడులు మొదలు పెట్టిన క్రమంలో వారిని ధీటుగా ఎదుర్కొంటోంది మన ఆర్మీ. 

 

ఉద్రిక్తత పెరిగితే గట్టిగానే బదులిస్తాం: జై జైశంకర్

ఉద్రిక్తత పెరిగితే గట్టిగానే బదులిస్తామని అమెరికాకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ దూకుడు చర్యల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఫోన్ సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని, కొలమానంగా స్పందిస్తోందని జైశంకర్ నొక్కి చెప్పారు. ఉద్రిక్తత పెరిగితే గట్టిగానే బదులిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.

 

 

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఎస్. జైశంకర్‌లను రూబియో సంప్రదించి, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సహా సరిహద్దు రాష్ట్రాల్లోని పలు భారత పట్టణాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ఈ పిలుపులు వచ్చాయి.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి

గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత పట్టణాలపై పూర్తి స్థాయి దాడి చేయడంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్ఎస్ పూర, అర్నియా, సాంబా, హీరానగర్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారీ కాల్పులు జరిగాయి.

ఆర్ఎస్ పూర, అర్నియా, సాంబా, హీరానగర్‌లపై ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను వైమానిక రక్షణ విభాగాలు అడ్డుకున్నాయి. భారత వైమానిక రక్షణ వ్యవస్థ ప్రతి క్షిపణిని, డ్రోన్‌ను కూల్చివేయడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !