విషాదం.. టీ-90 ట్యాంకు పేలి ఇద్దరు ఇండియ‌న్ ఆర్మీ సిబ్బంది మృతి..మ‌రొక‌రికి గాయాలు

By team teluguFirst Published Oct 7, 2022, 3:38 PM IST
Highlights

టీ-90 ట్యాంకు పేలడంతో ఇద్దరు ఆర్మీ సిబ్బంది చనిపోయారు. ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ చేపడుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

టీ-90 ట్యాంకుకు సంబంధించిన ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ నిర్వ‌హిస్తుండ‌గా జరిగిన ప్రమాదంలో ఇద్ద‌రు ఆర్మీ సిబ్బంది చ‌నిపోయారు. మ‌రొక‌రికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఝాన్సీ సమీపంలో ఉన్న బాబినా కంటోన్మెంట్ లో చోటు చేసుకుంది. టీ -90 ట్యాంక్ బ్యారెల్ ఒక్క సారిగా పేల‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతానికి అయితే మృతుల వివ‌రాలు ఇంకా స్ప‌ష్టంగా వెల్ల‌డి కాలేదు. మరిన్ని వివరాల కోసం ఆర్మీ అధికారులు ఎదురు చూస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ప్ర‌మాదానికి గురైన టీ-90 ట్యాంకు మూడో త‌రం రష్యన్ ప్రధాన యుద్ధ ట్యాంకు కావడం గమనార్హం.

పూణెలో రోడ్డు ప్ర‌మాదం.. భక్తులతో వెళ్తున్న ట్రక్ బోల్తా పడి 13 మందికి గాయాలు

‘‘ ఝాన్సీ సమీపంలోని బబీనా కంటోన్మెంట్ లో టీ-90 ట్యాంకు బారెల్ పేలడంతో జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్), మరో ఆర్మీ సిబ్బంది చనిపోయారు. ఈ ఘటనపై విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించాం ’’ అని ఇండియన్ ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

రెండు రోజుల కిందట అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలి ఓ పైలెట్ లో చనిపోయిన ఘటన పూర్తిగా మరకముందే ఇది చోటు చేసుకోవడం విచారకరం. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. తవాంగ్ లోని ఫార్వర్డ్ ప్రాంతాల వెంట రొటీన్ మిషన్ లో ఉన్న ఈ చాపర్ ఉదయం 10 గంటలకు ఒక్క సారిగా కుప్పకూలింది.

రావణ దహనం: బాడీ బూడిదైంది.. పది తలలు చెక్కు చెదరలేదు.. అధికారులపై యాక్షన్ 

వెంటనే పైలట్లను సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు. ‘‘ ఫార్వర్డ్ ఏరియాలో హెలికాప్టర్ రొటీన్ మిషన్ లో ఉన్న సమయంలో ఉదయం 10 గంటల ఈ సంఘటన జరిగింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను సమీపంలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పైలట్లలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.. మరో పైలట్ చికిత్స పొందుతున్నాడు ’’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఏఎస్ వాలియా ప్రకటించారు.

సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీల ప్యానెల్‌లో భిన్నాభిప్రాయాలు!.. సీజేఐకి ఓ లేఖ

కాగా.. ఆ ఘటనపై ఘటన పై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు  విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించారు. ‘‘ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా నుండి ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్ అయినట్టు వార్త వస్తోంది. పైలట్‌లు ప్రాణాలతో ఉండాలని ప్రార్థిస్తున్నారు ’’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. 
 

click me!