
ఆ ఇద్దరు బాలులు స్నేహితులు. ఇప్పుడు వేసవి కావడంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలంతా ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో సరదాగా ఆడుకోవడం, ఈత కొట్టేందుకు వెళ్లడం దినచర్యగా మారిపోయింది. ఎప్పటిలాగే శనివారం కూడా ఆ ఇద్దరు పిల్లలు ఈత కొట్టేందుకు వెళ్లారు. కానీ సరిగా ఈతరాకపోవడంతో వారు నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు అక్కడే ఉన్న మరో ముగ్గురు పిల్లలు నీటిలో దూకారు. కానీ వారందరూ నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
జూనియర్ పంచాయతీ సెక్రటరీల కీలక నిర్ణయం.. సమ్మె విరిమించి, విధుల్లో చేరుతామంటూ ప్రకటన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలోని ఓగ్రామానికి చెందిన 16-17 ఏళ్ల వయస్సు ఇద్దరు బాలులు కృష్ణసాగర్ సరస్సులో ఈత కొట్టేందుకు శనివారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే నీటిలో దిగి ఈత కొడుతున్న సమయంలో ఇద్దరు బాలులు అందులో మునిగిపోయారు. దీనిని గమనించిన మరో ముగ్గురు పిల్లలు వారిని కాపాడాలనే ఉద్దేశంతో నీటిలో దూకారు. కానీ వారికి కూడా పెద్దగా ఈత రాకపోవడంతో ఆ ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు. వీరి వయస్సు కూడా 17 సంవత్సరాల లోపే ఉంటుంది.
తానొక్కడినే గెలిచినా .. బీజేపీ ఓటమిలో చేయ్యేసిన గాలి జనార్థన్ రెడ్డి, 47 చోట్ల కమలం ఓట్లకు గండి
ఈ ఘటనపై పోలీసులకు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. కానీ పిల్లలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు బోటాడ్ ఎస్పీ కిశోర్ బలోలియా మీడియాకు తెలిపారు.
గత నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తిరుపతి జిల్లాలో గూడూరు మండలం విందూరు గ్రామంలో శ్రీనివాసులు పముజుల, వెంకటేశ్వర్లు కొండా, మోహన్ పముజులు స్నేహితులు. ఆ రోజు ఆదివారం కావడంతో వీరంతా సరదాగా ఈతకొట్టేందుకు కైవల్యా నదికి వెళ్లాలని భావించారు. వీరు ముగ్గురు స్నేహితులు మరో నలుగురు స్నేహితులను తీసుకొని ఆ నదికి వెళ్లారు.
Karnataka Elections: హిజాబ్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళ కనీజ్ ఫాతిమా విజయం
ముందుగా నదిలో ఈత కొట్టేందుకు 45 ఏళ్ల శ్రీనివాసులు పముజుల, అలాగే 35 ఏళ్ల వెంకటేశ్వర్లు కొండా, మోహన్ పముజుల నీటిలోకి వెళ్లారు. కానీ వారికి ఆ నదిలో నీటి లోతుపై అంచనా లేదు. కొంత సమయం ఈత కొట్టిన తరువాత వారు ఎక్కువ లోతున్న ప్రదేశానికి చేరుకొన్నారు. అక్కడ వారికి లోతు ఎక్కువగా ఉందన్న విషయం తెలియదు. ఇలా ఈత కొడుతున్న క్రమంలో నీరు ఎక్కువగా ఉన్న చోటు వారు ముగ్గురు మునిగిపోయారు. ఇందులో శ్రీనివాస్, వెంకటేశ్వర్లు నీటిలో మునిగిపోయారు. అయితే మోహన్ చాలా కష్టం మీద ఎలాగోలా నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే నీట మునిగిన స్నేహితులను కాపాడేందుకు మిగితా మిత్రులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వారిని కాపాడలేకపోయారు.