స్టార్ క్రికెటర్ ఇంట్లో విషాదం.. ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ కన్నుమూత..

Published : Feb 23, 2023, 04:37 PM IST
స్టార్ క్రికెటర్ ఇంట్లో విషాదం.. ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ కన్నుమూత..

సారాంశం

టీమిండియా స్టార్ క్రికెటర్ ఇంట విషాదం నెలకొంది. ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన 74 ఏళ్ల వయస్సులో ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 

స్టార్ క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) మరణించారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వస్థలమైన నాగ్‌పూర్‌లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయనను ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని ఇంటికి తీసుకొని వచ్చారు. కాగా అక్కడే గురువారం తుది శ్వాస విడిచారు. 

విమానంలోంచి దించి మరీ అరెస్ట్ : కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

ఫాస్ట్ బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ ప్రొఫెషనల్ రెజ్లర్. ఆయన తిలక్ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో పనిచేశారు. తిలక్ తన కుమారుడిని పోలీసు డిపార్ట్ మెంట్ లో, ఆర్మీలో చేర్పించాలని అనుకున్నారు. కానీ ఉమేష్ రంజీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. అక్కడి నుంచే ఆయన టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయ్యారు. 

తిలక్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా. కానీ ఆయనకు బొగ్గు గనిలో ఉద్యోగం లభించింది. దీంతో నాగ్ పూర్ దగ్గరలోని ఖపర్ ఖేడీకి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు కుమారుడు ఉమేష్ తో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 

దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మణం.. రాయచూరు వాసులుగా గుర్తింపు..

కాగా.. 2011లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఉమేష్ 54 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 35 ఏళ్ల వయస్సున్న ఆయన అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నారు. ఉమేష్ చివరిసారిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మీర్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడారు.

మనీలాండరింగ్ కేసు..సుకేష్ చంద్రశేఖర్ జైలు గది నుంచి లగ్జరీ వస్తువులు స్వాధీనం..కన్నీళ్లు పెట్టుకున్న నిందితుడు

75 వన్డేలు ఆడిన ఆయన 50 ఓవర్ల మ్యాచ్ లో 79 వికెట్లు పడగొట్టారు. 2015 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఉమేశ్ 2018 తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే 2022 టీ20 వరల్డ్ కప్ కు ముందు టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయనకు ఐసీసీ ఈవెంట్ జట్టులో చోటు దక్కలేదు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం