విమానంలోంచి దించి మరీ అరెస్ట్ : కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

Siva Kodati |  
Published : Feb 23, 2023, 04:23 PM IST
విమానంలోంచి దించి మరీ అరెస్ట్ : కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌కు సంబంధించి ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఢిల్లీ విమానాశ్ర‌యంలో హైడ్రామా న‌డుమ ప‌వ‌న్ ఖేరాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విమానంలోంచి దించేసి మరీ.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

అసలేం జరిగిందంటే :

రాయ్‌పూర్‌లో జరగనున్న ఏఐసీసీ ప్లీనరీకి సంబంధించి ఢిల్లీ నుంచి పవన్ ఖేరా ఇండిగో ఎయిర్‌పోర్టులో వెళ్లాల్సి వుంది. అయితే పోలీసులు సడెన్‌గా వచ్చి ఆయనను విమానంలోంచి దించేశారు. అయితే ఆ సమయంలో పవన్ వెంటే వున్న పలువురు సీనియర్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా నడుమ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి పవన్ ఖేరాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పవన్ అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఏకంగా రన్‌వేపైనే ఆందోళనకు దిగి విమానం టేకాఫ్ కాకుండా అడ్డుకున్నారు. 

ALso REad: భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని హిట్ల‌ర్ షాహీగా మార్చారు.. : మోడీ స‌ర్కారుపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఫైర్

ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీకాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్టు చేయడం ద్వారా మోడీ స‌ర్కారు భారత ప్రజాస్వామ్యాన్ని 'హిట్లర్‌షాహీ'గా మార్చిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమ‌ర్శించారు. "ప్రతిపక్షాలు పార్లమెంటులో సమస్యలను లేవనెత్తితే నోటీసు ఇస్తారు. సదస్సుకు ముందు ఛత్తీస్ గఢ్ కు చెందిన మన నేతలపై ఈడీ దాడులు జరిపింది. ఈ రోజు కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిని బలవంతంగా విమానం నుంచి కింద‌కు దింపి అరెస్టు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం హిట్లర్ షాహీగా మార్చేసింది. ఈ నియంతృత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఖ‌ర్గే పేర్కొన్నారు.నియ‌ర్ నాయ‌కులు రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ లు అరెస్టుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. మోడీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం గూండాల గుంపులా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయ‌కులు కేసీ.వేణుగోపాల్ ఆరోపించారు. ప‌వ‌న్ ఖేరాను ఢిల్లీ-రాయ్ పూర్ ఫ్లైట్ నుంచి కింద‌కు దింపి అరెస్టు చేయ‌డం ఏఐసిసి ప్లీనరీలో పాల్గొనకుండా అడ్డుకోవ‌డానికేన‌ని విమ‌ర్శించారు. "ఆయ‌న కదలికను పరిమితం చేయడం, ప్ర‌శ్నించే వారిని అణ‌చివేయ‌డానికి ప్ర‌భుత్వం ఇలా ఎఫ్ఐఆర్ ను ఉప‌యోగించుకోవ‌డం సిగ్గుమాలిన, ఆమోదయోగ్యం కాని చర్య అనీ, పార్టీ మొత్తం పవన్ వెంటే ఉంటుంద‌ని" తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu
Free Gas Cylinder: దీపావళికి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం