వంతెనపై నుంచి బోల్తా పడ్డ టూరిస్టు బస్సు.. ఇద్దరు మృతి, 30 మందికి పైగా గాయాలు..

By team teluguFirst Published Jan 23, 2023, 5:14 PM IST
Highlights

ఒడిశాలో ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధెంకనల్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచుబాటి సమీపంలోని బ్రిడ్జిపై నుంచి ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

మహారాష్ట్ర గవర్నర్‌గా దిగిపోతా.. ప్రధాని మోడీకి కూడా చెప్పేశా: భగత్ సింగ్ కొశ్యారీ

ప్రాథమిక నివేదికల ప్రకారం.. నీలమాధబ్ అనే టూరిస్టు బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పింది. నేరుగా వంతెన్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. తరువా కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని కేంద్రపారా జిల్లా ఇచ్ఛాపూర్ గ్రామానికి చెందిన రేణుబాల జెనా, బిజయలక్ష్మి స్వైన్‌లుగా గుర్తించారు.

అండమాన్‌ దీవుల పేర్లు పాపులారిటీ కోసం మాత్రమే.. నేతాజీ ప్రణాళికా సంఘాన్ని కేంద్రం ర‌ద్దు చేసింది: మమతా బెనర్జీ

స్థానికంగా ఉన్న గ్రామస్తులు, పోలీసులు క్షతగాత్రులను దెంకనల్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు తరలించారు. అయితే వీరిలో మరి కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తాజాగా అందుతున్న నివేదికలు తెలుపుతున్నాయి. ఈ బస్సులో మొత్తంగా 43 మంది ప్రయాణికులు ఉండగా.. వీరంతా ఇచ్ఛాపూర్ గ్రామం నుంచి బలంగీర్, సంబల్‌పూర్‌కు విహారయాత్రకు వెళ్లారు.

మ్యాథ్స్ టీచర్ కోసం ఆ స్కూల్ ఇచ్చిన యాడ్ ఇదీ.. ఫోన్ నెంబర్ ప్లేస్‌లో ఈక్వేషన్.. నెట్టింట్లో పోస్టు వైరల్

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సు స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదం నేషనల్ హైవే నెంబర్ 55లో జరిగింది. ఈ హైవేపై కటక్-అంగుల్, సంబల్‌పూర్-అంగుల్ మధ్యన పెద్ద గుంతలు ఉన్నాయి. ఈ రోడ్డుపై గడిచిన నాలుగేళ్లలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఇందులో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

జమ్మూలో ఉగ్రముప్పు మధ్య కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర‌.. సాంబాలో ఘ‌న స్వాగ‌తం

నేషనల్ హైవే నెంబర్ - 55 విస్తరణ, పునర్నిర్మాణ పనులలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది. రెధాఖోలాల్, దెంకనల్, ఇతర ప్రాంతాలలో స్థానికులు అనేక సార్లు నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్డు పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు రాజకీయ ప్రతినిధులు జోక్యం చేసుకున్నప్పటికీ పనులు నెమ్మదిగానే సాగుతున్నాయి. 
 

click me!