
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలో ఉన్న మదర్సాలో దారుణం వెలుగులోకి వచ్చింది. మదర్సాలోని మౌలానా ఇద్దరు పిల్లలను ఇనుప గొలుసులతో కట్టేశాడు. దానికి తాళం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేయలేదు. పైగా ఆ మౌలానాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు
Omar Abdullah: 'ప్రజలు తమ ఇళ్లలో ఉండానికి కూడా భయపడుతున్నారు ': కేంద్రంపై విరుచుకపడ్డ ఒమర్ అబ్దుల్లా
గోసైంగంజ్ శివలార్‌లో ఉన్న సుఫమ్‌దింతుల్ ఉలమా మదర్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అక్కడికి చదువుకునేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్థుల పాదాలకు ఇనుప గొలుసులు కట్టారు. అయితే వారిద్దరు మదర్సా నుంచి ఎలాగోలా తప్పించుకొని వారి గ్రామానికి చేరుకున్నారు. పిల్లల కాళ్లకు గొలుసులు పడి ఉండడం చూసి గ్రామస్తులు వారిని ఆపారు. మదర్సా ఉపాధ్యాయులు తమను బెత్తంతో కొట్టారని, కాళ్లను గొలుసుతో కట్టేశారని విద్యార్థులు ఆరోపించారు. అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు.
బాధితుల్లో ఒక విద్యార్థి గోసైంగంజ్ రాణిమౌ నివాసి అయిన షేరా కుమారుడు షాబాజ్ కాగా మరో విద్యార్థి, బారాబంకి జర్మావు నివాసి రాజు. వీరిద్దరూ గోసైంగంజ్‌లోని మదర్సాలో చదువుతున్నారు. శుక్రవారం పిల్లలిద్దరినీ గొలుసులతో కట్టివేడయంతో ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. సమీప గ్రామస్తులు వారిని నిలువరించి జరిగిన ఘటనను తెలుసుకున్నారు. షెహబాజ్, రాజు చేతులు, కాళ్లపై చాలా చోట్ల బెత్తంతో కొట్టిన గుర్తులు ఉన్నాయి. అయితే వీటి గురించి స్థానికులు ఆరా తీయగా తమను బలవంతంగా ఉపాధ్యాయులు చదివించారని, పాఠం గుర్తుకు రాలేదని బెత్తంతో కొట్టారని తెలిపారు. ఈ ఘనటపై మదర్సా మౌలానాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ladakh Bus Accident: "వీర సైనికులను కోల్పోయం.. " ప్రధాని మోదీ సంతాపం
గోసైంగంజ్ పోలీసులు అధికారి శైలేంద్ర గిరి ఈ ఘటన సమాచారాన్ని షాబాజ్ తండ్రి షేరాకు చేరవేశారు. కొంత సమయం తరువాత అతడు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. షాబాజ్‌కు చదువు రాదని షేరా పోలీసులకు చెప్పారు. గతంలో తమ బిడ్డ రెండు సార్లు మదర్సా నుంచి పారిపోయాడని అన్నారు. అందుకే షాబాజ్‌తో కఠినంగా వ్యవహరించాలని తామే ఆ మౌలానను కోరామని అన్నారు. తమ కుటుంబంలో ఎవరూ చదువుకోలేదని అని ఆయన చెప్పారు. తమ ఒక్కగానొక్క కొడుకు షాబాజ్‌ని బాగా చదివించాలనుకుంటున్నామని, అందుకే మదర్సాలో చేర్పించామని అన్నారు. కానీ షాబాజ్ తమ మాట వినడని, రంజాన్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చి తరువాత మదర్సాకు వెళ్లేందుకు ఇష్టపడలేదని తెలిపారు. అందుకే అతడికి ఇష్టం లేకున్నా మదర్సాకు పంపించామని అన్నారు. మదర్సా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని లిఖితపూర్వంగా ఆయన పోలీసు స్టేషన్ లో రాసి ఇచ్చారు. కాగా తమకు ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.