ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు.
రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్
రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ అయ్యారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. పూర్తి కథనం
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ?
బేగంపేట్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్టు తెలిసింది. ఇద్దరూ ఢిల్లీ వెళ్లుతుండగా ఎయిర్‌పోర్టులో రెండు గంటలపాటు సమావేశమైనట్టు సమాచారం. పూర్తి కథనం
మాధవీలతకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై కరాటే కళ్యాణీ
డాక్టర్ కొంపెల్లి మాధవీలతకు హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయడానికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై కరాటే కళ్యాణీ స్పందించారు. మహిళకు టికెట్ ఇవ్వడం సంతోషకరం అని, కానీ, మాధవీలత టికెట్ కోసమే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు తెలిసిందని కామెంట్ చేశారు. పూర్తి కథనం
ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నాలు
చంద్రబాబు నాయుడు ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి కథనం
ఇంట్లోకి వెళ్లి పూజామందిరంలో ధ్యానం చేసిన పిచ్చుక..
ఇంట్లోకి వెళ్లి పూజామందిరంలో ధ్యానం చేసిన పిచ్చుక వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను ఇక్కడ చూడండి
40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు
40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు చేతులు కలిపారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిని కలిగిస్తుంది. పూర్తి కథనం
ఆమె కాళ్లు మొక్కిన మోడీ.. వైరల్ వీడియో
ఓ మహిళ వేదిక మీదికి వచ్చి నేషనల్ క్రియేటర్స్ అవార్డు అందుకుంటూ ఉండగా ప్రధానికి గౌరవపూర్వకంగా కాళ్లు మొక్కారు. ఆ వెంటనే మోడీ ఆమె కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. పూర్తి కథనం
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్టుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పూర్తి కథనం
'బంగారం' హీరోయిన్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే
ఎట్టకేలకు మీరా చోప్రా తనకు కాబోయే భర్తని వెతుక్కుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తన ప్రియుడే. మూడేళ్ళుగా వీరిద్దరి లవ్ లో ఉన్నారట. పూర్తి కథనం
తొలి టెస్టులోనే అదరగొట్టిన దేవదత్ పడిక్కల్..
ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ తో భారత్ తరఫున అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్ క్లాసిక్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. పూర్తి కథనం