ఓ మహిళ వేదిక మీదికి వచ్చి నేషనల్ క్రియేటర్స్ అవార్డు అందుకుంటూ ఉండగా ప్రధానికి గౌరవపూర్వకంగా కాళ్లు మొక్కారు. ఆ వెంటనే మోడీ ఆమె కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఓ మహిళ కాళ్లు మొక్కడం నెట్టింట సంచలనంగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడంతో నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రదానోత్స కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ అవార్డు ప్రదానోత్స కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి తమిళనాడుకు చెందిన కథకురాలు కీర్తిక గోవిందసామి వేదిక మీదికి వచ్చింది. అవార్డు తీసుకోగానే గౌరవంతో ప్రధాని మోడీ కాళ్లు మొక్కింది. దీంతో మోడీ వెంటనే కొంత ఇబ్బంది పడ్డారు. వెనక్కి జరిగి ఆమె కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ? బీజేపీకి తెలుసా?
I get disturbed when daughters touch feet: PM Modi at the inaugural National Creators Award pic.twitter.com/x80b2YypWJ
— IANS (@ians_india)కళా ప్రపంచంలో గురువుల కాళ్లను నమస్కరించడం సహజమేనని, కానీ, రాజకీయాల్లో అలా చేస్తే అనేక అర్థాలు తీస్తారని ప్రధాని మోడీ అన్నారు. ఇక తన సొంత విషయానికి వస్తే.. తన కాళ్లు ఎవరైనా మొక్కితే తనకు బెరుకుగా ఉంటుందని వివరించారు. అసలు తనకు నచ్చదని తెలిపారు. కూతుళ్లు కాళ్లు మొక్కితే స్వీకరించలేనని స్పష్టం చేశారు.
ఇక మీద సోషల్ మీడియా క్రియేటర్లకు మంచి గుర్తింపు లభించనుంది. వారి కోసం ప్రత్యేకంగా తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అవార్డులనే ప్రకటిస్తున్నది. నేషనల్ క్రియేటర్స్ అవార్డును తీసుకురావడం సంతోషంగా ఉన్నదని ప్రధాని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ అవార్డు గురించి, మోడీ గురించి తెగ చర్చ జరుగుతున్నది.