రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్: శుభాకాంక్షలు తెలిపిన మోడీ

Published : Mar 08, 2024, 01:14 PM ISTUpdated : Mar 08, 2024, 01:33 PM IST
 రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్: శుభాకాంక్షలు తెలిపిన మోడీ

సారాంశం

రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ అయ్యారు. ఈ విషయమై  సోషల్ మీడియా వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

న్యూఢిల్లీ: రాజ్యసభకు  సుధామూర్తిని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.  సుధామూర్తిని  రాష్ట్రపతి ముర్ము నామినేట్ చేయడంపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  శుభాకాంక్షలు తెలిపారు.

also read:40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు: దాడి ఇంటికి కొణతాల

 

సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో  సుధామూర్తి  సేవలు స్పూర్తిదాయకంగా మోడీ పేర్కొన్నారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో  సుధామూర్తి  సేవలు స్పూర్తిదాయకంగా మోడీ పేర్కొన్నారు. రాజ్యసభలో  సుధా మూర్తి ఉండడం మన నారీశక్తికి  నిదర్శనంగా ప్రధాని పేర్కొన్నారు.

also read:40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు: దాడి ఇంటికి కొణతాల

అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి.  టెక్నికల్, ట్రావెల్ వంటి అంశాల్లో సుధామూర్తి అనేక రచనలు చేశారు. ఆంగ్ల, కన్నడ భాషల్లో ఆమె రచనలు ప్రసిద్ది చెందాయి.  యుకే ప్రధామంత్రి రిషి సునక్  వివాహం చేసుకున్న అక్షతా మూర్తికి సుధా మూర్తి తల్లి.

also read:హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?

1950 ఆగస్టు 19న కర్ణాటకలోని షిగ్గావ్ లో సుధామూర్తి జన్మించారు.  కంప్యూటర్ సైంటిస్ట్ గా, ఇంజనీరింగ్ గా తన వృత్తిని ప్రారంభించారు. టాటా ఇంజనీరింగ్, లోకో‌మోటివ్ కంపెనీ (టెల్కో)లో  తొలిసారిగా ఇంజనీర్ గా నియామకైన మహిళా ఇంజనీర్  సుధామూర్తి.

also read:ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన

ఆరోగ్య సంరక్షణ, పారిశుద్యం వంటి సమస్యలపై  ఇన్ఫోసిస్ పౌండేషన్  పనిచేస్తుంది.ఈ పౌండేషన్ కు సుధా మూర్తి  చైర్మెన్ గా వ్యవహరిస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో వేల గృహలను, స్కూల్స్, లైబ్రరీలను నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కూడ నిధులను సమకూర్చింది ఈ సంస్థ.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !