April 2nd - Top Ten News: టాప్ టెన్ తెలుగు వార్తలు.. నేటి బ్రేకింగ్ న్యూస్ 

By Rajesh Karampoori  |  First Published Apr 2, 2024, 7:58 PM IST

Top 10 News:  ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు


Top 10 News:  ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి) 

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల..  

Latest Videos

undefined

AP Congress list: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. తొలి విడతలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాక ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు.  

యోగా గురువు బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఆయన కోర్టుతో పాటు యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. పతంజలి ఔషధ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలపై తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మండిపడింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిమాణం 

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఎంపీ సంజయ్ సింగ్‌ను ఇన్నాళ్లు కస్టడీలోకి ఎందుకు తీసుకున్నారని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను(ED) సుప్రీంకోర్టు ప్రశ్నించింది.సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఉబర్‌ ఆటో చార్జ్‌ రూ.7.66 ​కోట్లు.. బిల్ చూసి బిత్తరపోయిన వ్యక్తి - ఎక్కడో తెలుసా?

ఓ ఆటోలో ప్రయాణించిన జర్నలిస్టుకు  రూ. 7.66 కోట్లు చార్జీ చెల్లించాలని   బిల్లు రావడంతో  అతను షాకయ్యాడు.  టెక్నికల్ సమస్యలతో రూ. 7.66 కోట్ల బిల్లు వచ్చినట్టుగా  గుర్తించారు.  ఇందుకు సంబంధించిన  వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మార్చి  29న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి ఎన్నికలకు వెళ్తోందని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీని కోరింది.

చిత్ర పరిశ్రమలో విషాదం... ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ మేరకు సమాచారం అందుతుంది. 

Janasena: జనసేనకు ఎన్నికల సంఘం భారీ షాక్..  
 
Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి, ప్రతిపక్ష కూటమికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఉన్నాయి. కానీ, జనసేన రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే పేర్కొంది. ఈ గ్లాస్ సింబల్ ను ఉచిత సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో జనసేన కలవరపాటుకు గురైంది.ఈ అంశంపై న్యాయ నిపుణల సలహా తీసుకోవాలని భావిస్తోంది.

జనసేనలో చేరిన మండలి బుద్దప్రసాద్
 
విజయవాడ: టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్  సోమవారంనాడు జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో  మండలి బుద్దప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టిక్కెట్టును  మండలి బుద్దప్రసాద్ ఆశించారు. అయితే  ఆవనిగడ్డ  అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా  తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించింది. ఆవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుండి  అనుచరులతో కలిసి వెళ్లి  పవన్ కళ్యాణ్ సమక్షంలో  మండలి బుద్దప్రసాద్  జనసేనలో చేరారు.

ఈడీ వేధింపుల ఏజెన్సీగా వ్యవహరిస్తోంది - కవిత తరపు న్యాయవాది


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేధింపుల ఏజెన్సీగా వ్యవహరిస్తోందని ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. కవిత బెయిల్ కోసం ఆయన సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు వినిపించారు. తన క్లయింట్ పై దర్యాప్తు పూర్తిగా ప్రేరేపితమైందని కోర్టుకు తెలిపారు.
 
కాంగ్రెస్‌లో చేరిన మరునాడే కడియం కావ్యకు టిక్కెట్టు

వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది.  కాంగ్రెస్ పార్టీలో చేరిన  మరునాడే  కాంగ్రెస్ పార్టీ కావ్యకు టిక్కెట్టు కేటాయించింది. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు  బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. అయితే  తనకు టిక్కెట్టు కేటాయించినందుకు  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిసి కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. అయితే  ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  కడియం కావ్య బీఆర్ఎస్ టిక్కెట్టును నిరాకరించింది.  ఈ విషయమై  కేసీఆర్ కు లేఖ రాశారు.
 

click me!