హసన్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Apr 2, 2024, 7:40 PM IST

రాజకీయంగానూ హసన్‌కు ఎంతో ప్రాధాన్యత వుంది. మాజీ ప్రధాని , దేవెగౌడ కుటుంబానికి హసన్ కంచుకోట వంటిదని చెప్పవచ్చు. 1991 నుంచి నేటి వరకు రెండు సార్లు తప్పించి దేవెగౌడ కుటుంబమే హసన్ లోక్‌సభ స్థానంలో గెలుస్తూ వస్తోంది. దేవెగౌడ హసన్ నుంచి ఐదు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, జనతాదళ్ 3 సార్లు, జేడీఎస్ 4 సార్లు, జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కొక్కసారి హసన్‌లో విజయం సాధించాయి. జేడీఎస్ నుంచి మరోసారి ప్రజ్వల్ రేవణ్ణ బరిలో దిగారు.  కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ పటేల్‌ను బరిలో దించింది. 


హసన్ ఈ పేరు చెప్పగానే.. రాష్ట్రకూటులు, హోయసల సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఎన్నో ప్రదేశాలు హసన్ జిల్లాలో వున్నాయి. రాజకీయంగానూ హసన్‌కు ఎంతో ప్రాధాన్యత వుంది. దక్షిణ, మధ్య కర్ణాటక ప్రాంతంలో విస్తరించి వున్న హసన్ రాజకీయాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతాయి. మాజీ ప్రధాని , దేవెగౌడ కుటుంబానికి హసన్ కంచుకోట వంటిదని చెప్పవచ్చు. 1991 నుంచి నేటి వరకు రెండు సార్లు తప్పించి దేవెగౌడ కుటుంబమే హసన్ లోక్‌సభ స్థానంలో గెలుస్తూ వస్తోంది. తొలుత దేవెగౌడ, ఆయన మనుమడు ప్రజ్వల్ దేవెగౌడలు హసన్ ఎంపీలు గెలుస్తూ వస్తున్నారు. దేవెగౌడ హసన్ నుంచి ఐదు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత జేడీఎస్‌లకు ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. 

హసన్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. దేవెగౌడ ఫ్యామిలీకి కంచుకోట :

Latest Videos

కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, జనతాదళ్ 3 సార్లు, జేడీఎస్ 4 సార్లు, జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కొక్కసారి హసన్‌లో విజయం సాధించాయి. చిక్కమగుళూరు, హసన్ జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి వుంది. హసన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కడూర్, శ్రావణ బెలగోళ, అర్సికెరె, బెలూర్, హసన్, హోలెనర్సిపూర్, అర్కాల్‌గుడ్, సక్‌లేష్‌పూర్ (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలున్నాయి.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హసన్ పార్లమెంట్ పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్ 4 చోట్ల, కాంగ్రెస్, బీజేపీలో చెరో రెండు చోట్ల విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్ధి ప్రజ్వల్ రేవణ్ణకు 6,76,606 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి ఏ మంజుకు 5,35,382 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధి వినోద్ రాజ్‌కు 38,761 ఓట్లు పోలయ్యాయి.  మొత్తంగా 1,41,224 ఓట్ల మెజారిటీతో ప్రజ్వల్ విజయం సాధించి హసన్ తమ కుటుంబానికి కంచుకోట అని నిరూపించారు. 

హసన్ ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీ :

2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే.. జేడీఎస్ నుంచి మరోసారి ప్రజ్వల్ రేవణ్ణ బరిలో దిగారు. దేవెగౌడ ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్‌తో పాటు హసన్ పార్లమెంట్ పరిధిలో జేడీఎస్ బలంగా వుండటం, బీజేపీ పొత్తుతో మరోసారి తన విజయం ఖాయమని ప్రజ్వల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ పటేల్‌ను బరిలో దించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో దేవెగౌడ కంచుకోటను బద్ధలు కొడతానని శ్రేయస్ చెబుతున్నారు. 

click me!