Today's Top Stories: శుభోదయం.. ఇవాళ్టీ telugu.asianetnews.com టాప్ న్యూస్ లో తెలంగాణ నుండి రాహుల్ పోటీ ! నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. గగన్‌యాన్ వ్యోమగాములు వీరే.. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్, కేటీఆర్ కీలక ప్రకటన.. 1న బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డ, 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాల ప్రారంభం, "డైమండ్ రాణి " మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు, లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల ఉద్యోగాలు , చంద్రబాబు ఓటమి ఖాయం: విజయసాయిరెడ్డి, అంబానీ కొడుకు ప్రీ-వెడ్డింగ్ లో 2,500 రకాల వంటకాలు, గగన్ యాన్: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే, అరవింద్ కేజ్రీవాల్‌కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు, 8 వికెట్ల తేడాతో గుజరాత్ చిత్తు.. వరుసగా బెంగళూరుకు రెండో విజయం వంటి వార్తల సమాహారం.
Today's Top Stories: (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
తెలంగాణ నుండి కాంగ్రెస్ అగ్రనేతను పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభకు సోనియా గాంధీ ఎన్నిక కావడంతో తెలంగాణ నుండి రాహుల్ గాంధీని పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కోరుతుంది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది.
కేటీఆర్ కీలక ప్రకటన.. 1న బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డ..
Chalo Medigadda: కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మార్చి 1న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 'చలో మేడిగడ్డ' కార్యక్రమం చేపడుతున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 150 మంది బీఆర్‌ఎస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొంటారని కెటి రామారావు ప్రకటించారు.
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
TS Inter Exams 2024: తెలంగాణలో నేటీ నుంచి (ఫిబ్రవరి 28) ఇంటర్మీడియట్ ప్రారంభంకానున్నాయి. ఒకేషనల్ అభ్యర్థులు సహా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరకానున్నారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరుగనున్న ఈ పరీక్షలకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షలకు ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాల ప్రారంభం
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై కసరత్తు చేస్తుంది. తాజాగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహావసరాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారంనాడు ప్రారంభించారు.తెలంగాణ సచివాలయంలో ఈ పథకాలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
"డైమండ్ రాణి " మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
Bandla Ganesh: కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఏపీ మంత్రి రోజాపై మండిపడ్డారు. ఆమె ఓ డైమండ్ రాణి అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని బండ్ల గణేష్ అన్నారు. ఆమె పని చేస్తున్న పార్టీ అధినేతనే యాక్సిడెంట్ సీఎం అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అంతేకానీ, రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. రోజా తరహా ఇక్కడ చేపల పులుసు వండి పెడితే పదవులు రావని విమర్శించారు.
లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల ఉద్యోగాలు
CM Revanth: హైదరాబాద్ నగరంలో త్వరలోనే జీనోమ్ వ్యాలీ (Genome Valley) రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 (BioAsia 2024 ) సదస్సును ప్రారంభించిన సీఎం ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను అభినందించారు. మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామనీ, లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపారు.
"45 రోజులు.. టార్గెట్ 175.."
CM Jagan : రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన సామర్థ్యంతో తాను చేయగలిగినదంతా చేశాననీ, ఇప్పుడు తమరి వంతు. అందరూ గెలవాలని కోరుకుంటున్నాననీ, పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లండని , మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి అని కర్తవ్య బోధ చేశారు. మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండని మంగళగిరిలో మంగళవారం జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు.
తెలుగు క్రికెటర్ కంటే కార్పోరేటరే ఎక్కువయ్యాడా..?: పవన్ కల్యాణ్
Hanuma Vihari :ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై తెలుగు యువ క్రికెటర్ హనుమ విహారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ నుండి తనను తప్పించడానికి ఓ రాజకీయ నాయకుడే కారణమని ... అతడి కొడుకు కోసమే తనను బలిచేసాడని విహారీ ఆరోపించారు. తనకు జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నాను... కాబట్టి ఇకపై ఆంధ్ర జట్టు తరపున ఆడబోనని విహారి ప్రకటించారు. ఇలా హనుమ విహారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకుని అధికార వైసిపిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు ఓటమి ఖాయం: విజయసాయిరెడ్డి
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని బల్లగుద్ధి చెబుతున్నారు వైసీపీ రాజ్యసభ్ సభ్యుడు విజయసాయిరెడ్డి. 2004లో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందని, 2014 నాటికి అది 62.5 శాతానికి పడిపోయిందన్నారు. 2019లో ఇది 55.19 శాతానికి దిగజారిందని.. కేవలం 30,722 ఓట్ల తేడాతోనే చంద్రబాబు గెలిచారని విజయసాయిరెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతల కీలక స్థానాలైన కుప్పం, హిందూపురం, మంగళగిరి, ఉరవకొండ, టెక్కలిపై వైసీపీ ఫోకస్ పెట్టింది.
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ఎఫ్ఐఆర్ నమోదు
టాలీవుడ్ లో తరచుగా డ్రగ్స్ వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఎంతలా కుదిపేసిందో తెలిసిందే. ఇటీవలే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులందరికి ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ డ్రగ్స్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు అమ్మాయిలతో పాటు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అంబానీ కొడుకు ప్రీ-వెడ్డింగ్ లో 2,500 రకాల వంటకాలు
Anant Ambani Radhika Merchant Wedding: ప్రపంచ కుబేరుడు, రిలియన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు రాధికా మర్చెంట్‌ను (Radhika Merchant) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ తరుణంలో మార్చి 1-3 తేదీల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక జరగనుంది. ఈ వేడుక కోసం ఇండోర్ నుండి సుమారు 25 మంది చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు.ఈ ఈవెంట్ లో ఇండియన్ పుడ్ తో పాటు ఏషియన్ కాంటినెంటల్, మెడిటేరియన్, పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ ఫుడ్స్‌ను సిద్ధం చేస్తారట. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో దాదాపు 2500 రకాల వంటకాలను అతిథులకు అందించనున్నారు.
గగన్ యాన్: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే
భారత అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్ యాన్ లో పాల్గొనే వ్యోమగాములు పేర్లను ఇస్రో వెల్లడించింది. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశ్ సుక్లా లు గగన్ యాన్ లో పాల్గొంటారు. అంతరిక్ష యాత్రలో పాల్గొనే వ్యోమగాముల పేర్లను ఇస్రో మంగళవారం వెల్లడించింది. గగన్ యాన్ అంతరిక్షయానం చేసే వ్యోమగాములు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.బెంగుళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో వీరంతా కఠినమైన శిక్షణ పొందారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఈ ఘట్టం కీలక మైలురాయిని సూచిస్తుంది.
అరవింద్ కేజ్రీవాల్‌కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంగళవారం నాడు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో కోరారు. లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఎనిమిదో సారి. ఈ నెల 26న ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావాలి. కానీ,ఈ విచారణకు ఆయన హాజరు కాలేదు. దీంతో తాజాగా ఇవాళ మరోసారి కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
WPL 2024: 8 వికెట్ల తేడాతో గుజరాత్ చిత్తు.. వరుసగా బెంగళూరుకు రెండో విజయం
Royal Challengers Bangalore vs Gujarat Giants: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో సీజన్ ఐదో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ పై విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 108 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ 12.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది.