కల్తీ మద్యం సేవించి ముగ్గురు మృతి.. మరో ఆరుగురికి అస్వస్థత.. బీహార్ లో ఘటన

By team teluguFirst Published Jan 23, 2023, 12:25 PM IST
Highlights

బీహార్ లో మరో సారి కల్తీ మద్యం విషాదం నింపింది. కల్తీ మద్యం తాగిన పలువురిలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

బీహార్‌లోని సివాన్ జిల్లా బాలా గ్రామంలో ఆదివారం కల్తీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు అస్వస్థతకు లోనయ్యారు. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ పాండే బాధితులు చికిత్స పొందుతున్న సదర్ ఆసుపత్రికి అర్ధరాత్రి సమయంలో చేరుకొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా ప్రధాని నిషేధిస్తారా? - అసదుద్దీన్ ఒవైసీ

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారు సివాన్‌లోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తాము ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే మరణాలకు గల కారణాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

వరకట్నహత్య?.. ఉరికి వేలాడుతూ వివాహిత.. ఆత్మహత్య అంటున్న అత్తింటివారు..

కాగా.. 2022 డిసెంబర్‌లో బీహార్‌లోని ఛప్రా జిల్లాలో నకిలీ మద్యం సేవించి 70 మంది చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఒక మద్యం స్మగ్లర్‌ను అరెస్టు చేసింది. రూ.2.17 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. ఛప్రాలో జరిగిన హూచ్ విషాదం జాతీయ స్థాయిలో వెలుగుచూసింది. ఈ సంఘటన తర్వాత అక్రమ మద్యం వ్యాపారం, రవాణా, స్మగ్లింగ్, బ్రూయింగ్‌లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడానికి సరన్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు.

click me!