వెయ్యేళ్ల కిందటి శివాలయం.. ఏడాదికోసారి శివరాత్రినాడు మాత్రమే తెరుచుకునే ద్వారాలు.. ఎక్కడంటే..

Published : Feb 18, 2023, 06:44 AM IST
వెయ్యేళ్ల కిందటి శివాలయం.. ఏడాదికోసారి శివరాత్రినాడు మాత్రమే తెరుచుకునే ద్వారాలు.. ఎక్కడంటే..

సారాంశం

ఓ వెయ్యేళ్ల దేవాలయం యేడాదికి ఒకసారి తెరుచుకుంటుంది. అదీ శివరాత్రి రోజు మాత్రమే దర్శనం జరుగుతుంది. మధ్య ప్రదేశ్ లోని ఆ దేవాలయం విశిష్టత ఏంటంటే..   

మధ్యప్రదేశ్ : మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ లో ఉన్న ఓ ఆలయం శనివారం తెరుచుకోనుంది. ఈ ఆలయం ఏడాదికోసారి మాత్రమే  తెరుస్తారు.  ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 48కి.మీ.ల దూరంలోని  రాయ్ సెన్ జిల్లాలో ఉంది. ఇది సోమేశ్వరాలయం. ఏడాది పొడవునా ఈ ఆలయం మూసే ఉంటుంది. మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరవడం ప్రత్యేకత. ఈ ఆలయం 1000 అడుగుల ఎత్తైన కొండపైన ఉంటుంది.  పదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు.

ఆ తర్వాత దేశాన్ని పాలించిన పలువురు ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1974లో ఈ ఆలయాన్ని సామాన్య భక్తుల కోసం తెరవాలని ఒక ఉద్యమం కూడా జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ ఈ  సోమేశ్వరాలయం   తాళం తీసి, ద్వారాలు తెరిచి శివరాత్రి రోజు ఒక్కరోజు మాత్రమే పూజలు నిర్వహించాలని అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది.

ఈశా మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గానంతో అలరించనున్న రామ్ మిరియాల, మంగ్లీ...

అప్పటినుంచి ఈ ఆలయం ప్రతిఏటా శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు.. 12 గంటలపాటు మాత్రమే తెరుస్తారు. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు జరిగే శివరాత్రి వేడుకల కోసం ఈ ఆలయాన్ని తెరవనున్నారు. ఏడాదికోసారి మాత్రమే ఆలయ ద్వారాలు తెరుచుకుని ఉండడంతో భక్తులు ఈ ఆలయానికి పోటెత్తారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రసాదంగా కిచిడి, పండ్లను పంపిణీ చేస్తారు. ఈ యేడు ఐదు క్వింటాళ్ల కిచిడి,  పండ్లను ప్రసాదంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు