
ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్స్‌గంజ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో..పికప్ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ప్రమాదం రాబర్ట్స్‌గంజ్‌లోని కుసిదౌర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఈ బృందం ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.
\ఈ ప్రమాద ఘటనలో వారణాసికి చెందిన శశి శర్మ (35), వినయ్ రాజ్‌భర్ (40) మృతి చెందినట్లు రాబర్ట్స్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బల్ముకుంద్ మిశ్రా తెలిపారు. గాయపడిన ఆరుగురిలో ఇద్దరు అరుణ్ (19), అజీత్ (20) పరిస్థితి విషమంగా ఉందని మిశ్రా తెలిపారు. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు.
అలాగే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాంత్ ప్రాంతంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో ఇద్దరు మరణించారు. కాగా మరో 11 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన జలాభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు సంభాల్ నుంచి హరిద్వార్‌కు వెళ్తుండగా కన్వరియాలతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి పొలంలో బోల్తా పడిందని పోలీసు వర్గాలు తెలిపాయి. 13 మంది ట్రాలీ కింద నలిగిపోవడంతో గాయపడ్డారు, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నందున వారిని ఉన్నత కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందిన పోలీసులు తెలిపారు.
అందిన సమాచారం ప్రకారం, సంభాల్ జిల్లాలోని అస్మోలీ ప్రాంతానికి చెందిన జయంతిపూర్ నివాసి ప్రదీప్ కుమార్ సింగ్, గ్రామస్థులను ట్రాక్టర్ ట్రాలీలో కాన్వాడ్‌కు తీసుకెళ్లడానికి హరిద్వార్ వెళ్తుండగా, సరిహద్దు ప్రాంతంలో ట్రాక్టర్ ట్రాలీ ప్రమాదం జరిగింది. కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోహరా-బిజ్నోర్‌లో జరిగింది.
ఈ ప్రమాదంలో సన్నీ, పప్పు, బబిత, సుహాని, శ్యామ్, ఈశ్వరి, ప్రదీప్ సహా 13 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మొరాదాబాద్ ఉన్నత కేంద్రానికి రెఫర్ చేశారు. పప్పు (45) , మైన్‌పాల్ కుమారుడు 19 ఏళ్ల సన్నీతో సహా ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్, ఎస్‌ఎస్పీ హేమ్‌రాజ్ మీనా, ఎస్పీ దేహత్ సందీప్ కుమార్ మీనా, పోలీసు అధికారి (సిఓ) కాంత్ డాక్టర్ గణేష్ కుమార్ గుప్తా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసు బలగాల సహాయంతో, గాయపడిన నలుగురిని ఎస్కార్ట్ వాహనం , ప్రభుత్వ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.