
కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతదేహాలు రైల్వే ట్రాక్ పై లభించడం మూడు రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరిని ఎవరైనా హత్య చేశారా ? లేకపోతే ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.
భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు మీ జేబులో నుంచి చెల్లించండి.. : కేంద్ర ప్రభుత్వంతో సుప్రీం కోర్టు
ముగ్గురు మృతులను తొండేబావి రైల్వే స్టేషను సమీపంలో నివాసం ఉండే 50 ఏళ్ల మైలారప్ప, అతడి 45 ఏళ్ల భార్య పుష్పలత, 25 ఏళ్ల మమత అని కనుగొన్నారు. అయితే మైలారప్ప పెద్ద కూతురు అయిన మమతకు కొంత కాలం కిందట పెళ్లి జరిగింది. పలు కారణాల వల్ల ఆమె విడాకులు తీసుకుంది. దీంతో ఆమె తన తల్లిగారింటికి వచ్చింది. ఈ విషయంలో తల్లిదండ్రులు మానసిక వేధనకు గురయ్యారు.
మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన యువకుడు.. తీవ్రగాయాలతో మృతి..!
కూతురు వైవాహిక జీవితం ఇలా అయ్యిందేంటని ఆందోళన చెందారు. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్థాపంతో తల్లిదండ్రులు, కూతురు మమత కలిసి రైల్వే ట్రాక్ పై పడుకొని సూసైడ్ చేసుకున్నారు. వారిపై నుంచి రైలు వెళ్లడంతో శరీరాలు ఛిద్రం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే మృతులు ఎవరన్నది మొదట్లో పోలీసులకు అర్థం కాలేదు. ఈ ఘటనపై పోలీసులను అనుమానస్పద కేసును నమోదు చేశారు. ముగ్గురు మృతులదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో వారి దుస్తులు సేకరించారు.
ఘోరం.. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
అయితే ఇదే సమయంలో తమ తల్లిదండ్రులు, సోదరి కనిపించడం లేదని మైలారప్ప చిన్న కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో భద్రపరిచిన దుస్తులను ఆమెకు చూపించారు. ఆ దుస్తులు తమ కుటుంబ సభ్యులవే అని ఆమె గుర్తించింది. తీవ్రంగా రోధించింది. దీంతో ఇది హత్య కాదు.. ఆత్మహత్య అని నిర్ధారణకు వచ్చారు.
దారుణం.. నరబలి ఆచారంలో బాలుడి శిరచ్ఛేదం.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి..
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.