మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన యువకుడు.. తీవ్రగాయాలతో మృతి..!

Published : Jan 12, 2023, 09:33 AM IST
 మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన యువకుడు.. తీవ్రగాయాలతో మృతి..!

సారాంశం

మెట్రో స్టేషన్ పై నుంచి దూకడంతో... యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయాడు.

మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ పై నుంచి దూకడంతో... యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ కి చెందిన నితీష్ కుమార్(21) మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. బిహార్ కి చెందిన ఈ యువకుడు.. నోయిడాలో చదువుతున్నాడు. కాగా... జనవరి 9వ తేదీన నితీష్ కుమార్... నాలెడ్జ్ పార్క్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి... ఆత్మహత్య చేసుకోవడానికి పై నుంచి కిందకు దూకేశాడు. యువకుడు కిందకు దూకడాన్ని స్థానికులు వెంటనే గమనించి... మెట్రో స్టేషన్ మేనేజర్ కి సమాచారం అందించారు. అంతేకాదు.. నితీష్ ని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని యదార్థ ఆస్పత్రికి తరలించారు. అయితే... అతనికి తీవ్రంగా గాయాలు కావడంతో... ఆస్పత్రిలో  చికిత్స పొందుతూనే అతను చనిపోయాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు