‘‘ఇది సత్యాగ్రహం కాదు.. దురాగ్రహం ’’- కాంగ్రెస్ ఆందోళ‌న‌లపై మండిప‌డ్డ బీజేపీ

Published : Jul 21, 2022, 01:30 PM IST
‘‘ఇది సత్యాగ్రహం కాదు.. దురాగ్రహం ’’- కాంగ్రెస్ ఆందోళ‌న‌లపై మండిప‌డ్డ బీజేపీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనపై బీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. దేశాన్ని, దాని చట్టాలను, ఏజెన్సీలను కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు గౌరవించడం లేదని పేర్కొంది. పార్లమెంట్ కు రాని ఎంపీలు ఈడీని ప్రశ్నిస్తున్నారని తెలిపింది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. దీనిపై బీజేపీ మండిప‌డింది. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. ఆ పార్టీ నాయ‌కులు చేస్తున్న‌ది స‌త్యాగ్ర‌హం కాద‌ని, దురాగ్ర‌హం అని విమ‌ర్శించింది. 

Justice for Srimathi : తమిళనాడు విద్యార్థిని అనుమానాస్పద మృతిలో.. తండ్రి పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు...

ఈ మేర‌కు బీజేపీ నేత ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేసేది స‌త్యాగ్ర‌హం కాద‌ని, ఇది నిజానికి దురాగ్ర‌హం అని అన్నారు. ‘‘ వాస్త‌వానికి ఈ కేసులో వారు (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ) బెయిల్‌పై ఉన్నారు. వివిధ కోర్టుల నుంచి ఉపశమనం పొందలేదు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల జేబు పార్టీగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆస్తులను జేబులో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అదే ప్రయత్నం జరుగుతోంది.ఇది గాంధీ కుటుంబాన్ని రక్షించడం “సత్యగహ్” కాదు  దేశం, దాని చట్టాలు, దాని ఏజెన్సీల‌కు వ్య‌తిరేకంగా చేసే  “దురాగ్రా” (మొండి డిమాండ్).  వేల కోట్ల రూపాయల విలువైన పార్టీ ఆస్తులను జేబులో వేసుకున్న కుటుంబాన్ని రక్షించడానికి చేస్తున్న ప‌ని ’’ అని ఆయ‌న అన్నారు. 

మీడియాను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు.. : కాంగ్రెస్ నాయ‌కులు జైరాం రమేష్

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ విలువైన ఆస్తులను సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు లాక్కున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కైవసం చేసుకునేందుకు గాంధీలు యంగ్ ఇండియన్‌ను నడిపించారని, అందులో సోనియా, రాహుల్‌లకు 76 శాతం వాటాలు ఉన్నాయని ఆరోపించారు. కాగా తమ నేతలపై ఈడీ చర్యను అధికార బీజేపీ  మండిప‌డుతూ దీనిని రాజకీయ ప్రతీకారంగా కాంగ్రెస్ అభివర్ణించింది.

అయితే దీనిపై స్పందించిన ర‌వి శంక‌ర్.. చట్టాన్ని, సంస్థలను బీజేపీ గౌరవిస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాత్రం ఈడీని నిలదీయాలని చూస్తోందని తెలిపారు. పార్లమెంట్‌కు హాజరుకాని ఆ పార్టీ నాయకులు, ఎంపీలు ఢిల్లీలో కూర్చొని ఈడీని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

Forbes List: బిల్ గేట్స్ వెన‌క్కి నెట్టిన అదానీ.. ప్ర‌పంచ‌ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో నిలిచాడంటే?

కాగా త‌మ అధ్యక్షురాలిని ఈడీ ప్ర‌శ్నించ‌డానికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతామ‌ని కాంగ్రెస్ బుధ‌వారమే ప్ర‌క‌టించింది. ‘‘ కాంగ్రెస్ కుటుంబం మొత్తం అధ్యక్షురాలు సోనియా గాంధీకి అండగా నిలుస్తోంది. రేపు బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ’’ అని ట్విట్టర్ తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?