ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. బీజేపీ సీనియర్ నేతలకు పాత శాఖల బాధ్యతలనే అప్పగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఐదుగురికి కేబినెట్ లో అవకాశం దక్కింది. వారికి ఏ శాఖలు కేటాయించారంటే...?
కేంద్రంలో ప్రధాని మోదీ 3.0 జట్టుపై మరింత క్లారిటీ వచ్చింది. ఆదివారం మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయగా... పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ తొలి భేటీ అనంతరం మంత్రులు, సహాయ మంత్రులకు శాఖలు కేటాయించారు.
ప్రధాని మోదీ వద్ద పింఛన్లు, సిబ్బంది వ్యవహారాలు, పబ్లిక్ గ్రీవెన్స్, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధానపరమైన అంశాలు, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు ఉన్నాయి.
undefined
తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రులు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయగా.. వారికి ఏ శాఖలు కేటాయించారంటే...?
కేంద్ర మంత్రి | శాఖలు |
రాజ్ నాథ్ సింగ్ | రక్షణ శాఖ |
అమిత్ షా | హోం, సహకారం |
నితిన్ గడ్కరీ | రోడ్డు రవాణా, జాతీయ రహదారులు |
జేపీ నడ్డా | వైద్యం, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువులు |
శివరాజ్ సింగ్ చౌహాన్ | వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి |
నిర్మలా సీతారామన్ | ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు |
ఎస్.జైశంకర్ | విదేశీ వ్యవహారాలు |
మనోహర్ లాల్ ఖట్టర్ | గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి |
HD కుమార స్వామి | భారీ పరిశ్రమలు, స్టీల్ |
పియూష్ గోయల్ | వాణిజ్యం, పరిశ్రమలు |
ధర్మేంద్ర ప్రధాన్ | విద్య |
జితన్ రామ్ మాంఝీ | ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు |
రాజీవ్ రంజన్ సింగ్ | పంచాయతీరాజ్, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ |
సర్బానంద సోనోవాల్ | పోర్టులు, షిప్పింగ్, జల రవాణా |
వీరేంద్ర కుమార్ | సామాజిక న్యాయం, సాధికారత |
కింజరాపు రామ్మోమన్ నాయుడు | పౌర విమానయాన శాఖ |
ప్రహ్లాద్ జోషీ | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనం |
జుయల్ ఓరమ్ | గిరిజన వ్యవహారాలు |
గిరిరాజ్ సింగ్ | జౌళి |
అశ్వనీ వైష్ణవ్ | రైల్వే, సమాచార &ప్రసార, ఎలక్ట్రానిక్స్ & ఐటీ |
జ్యోతిరాదిత్య సింధియా | టెలికం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి |
భూపేందర్ యాదవ్ | పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు |
గజేందర్ సింగ్ షెకావత్ | సాంస్కృతిక, టూరిజం |
అన్నపూర్ణా దేవి | మహిళా శిశు సంక్షేమం |
కిరణ్ రిజుజు | పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు |
హర్దీప్ సింగ్ పూరి | పెట్రెలియం, సహజ వాయువులు |
మన్సుఖ్ మాండవీయా | కార్మిక, యువజన సర్వీసులు, క్రీడలు |
జి.కిషన్ రెడ్డి | బొగ్గు, గనులు |
చిరాగ్ పాశ్వాన్ | ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ |
సీఆర్ పాటిల్ | జల శక్తి |
ఇకపోతే, 36 మంది ఎంపీలకు కేంద్ర సహాయ మంత్రులుగా ఎన్డీయే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి.
కేంద్ర సహాయ మంత్రి | శాఖలు |
జితిన్ ప్రసాద | వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ |
శ్రీపాద యశో నాయక్ | ఇంధనం, న్యూ & రెన్యుబుల్ ఎనర్జీ |
పంకజ్ చౌదరి | ఆర్థిక శాఖ |
క్రిషన్ పాల్ | సహకార శాఖ |
రామ్ దాస్ అథావలే | సామాజిక న్యాయం, సాధికారత |
రామ్ నాథ్ ఠాకూర్ | వ్యవసాయం, రైతు సంక్షేమం |
నిత్యానంద రాయ్ | హోం అఫైర్స్ |
అనుప్రియ పటేల్ | వైద్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు |
వి.సోమన్న | జల శక్తి, రైల్వే |
పెమ్మసాని చంద్రశేఖర్ | గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ |
ఎస్పీ సింగ్ భగేల్ | ఫిషరీస్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ |
శోభా కరంద్లాజే | సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి కల్పన |
కీర్తివర్ధన్ సింగ్ | పర్యావరణం, అటవీ, పర్యావరణ మార్పు, విదేశీ వ్యవహారాలు |
బి.ఎల్. వర్మ | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం |
శంతను ఠాకూర్ | పోర్టులు, షిప్పింగ్, జల రవాణా |
సురేశ్ గోపీ | పెట్రోలియం, సహాజ వాయువులు, టూరిజం |
డాక్టర్ L మురుగన్ | సమాచార, ప్రసారం, పార్లమెంటరీ వ్యవహారాలు |
అజయ్ తమ్తా | రోడ్డు రవాణా, హైవేస్ |
బండి సంజయ్ కుమార్ | హోం |
కమలేశ్ పాశ్వాన్ | గ్రామీణాభివృద్ధి |
భగీరథ్ చౌదరి | వ్యవసాయం, రైతు సంక్షేమం |
సతీశ్ చంద్ర దూబె | బొగ్గు, గనులు |
సంజయ్ సేథ్ | రక్షణ |
రన్వీత్ సింగ్ | ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే |
దుర్గాదాస్ ఉయికె | గిరిజన వ్యవహారాలు |
రక్షా నిఖిల్ ఖడ్సే | క్రీడలు, యువజన సర్వీసులు |
సుకంత మజుందార్ | విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి |
సావిత్రీ ఠాకూర్ | మహిళా శిశు సంక్షేమం |
తోఖన్ సాహూ | గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి |
రాజ్ భూషణ్ చౌదరి | జల శక్తి |
భూపతిరాజు శ్రీనివాస వర్మ | భారీ పరిశ్రమలు, స్టీల్ |
హర్ష్ మల్హోత్ర | కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు |
నిముబెన్ జయంతిభాయ్ బంభానియా | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ |
మురళీధర్ మొహోల్ | సహకార, పౌర విమానయాన |
జార్జ్ కురియన్ | మైనారిటీ వ్యవహారాలు, ఫిషరీస్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమలు |
పబిత్ర మార్గెరిట | విదేశీ వ్యవహారాలు, జౌళి |