ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలకు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ ఇచ్చారంటే...
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆదివారం ప్రమాణం స్వీకారం చేసిన 30 మంది కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి... నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3కోట్ల ఇళ్లు నిర్మించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల మంది పేదలకు గృహాలు నిర్మించనున్నారు. అలాగే, గ్రామీణాభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే, మంత్రులకు శాఖల కేటాయింపుపైనా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులకు శాఖలకు కేటాయించింది. నితిన్ గడ్కరీకి రోడ్లు, రవాణా శాఖను కేటాయించారు. గతంలో పనిచేసిన శాఖనే ఆయనకు తిరిగి అప్పగించారు. రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ తమ్తా అవకాశం దక్కించుకున్నారు.
కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎస్.జయశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి బాధ్యతలు అప్పగించారు.
అశ్వనీ వైష్ణవ్ - రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు
హర్దీప్ సింగ్ పూరీ - ఇంధన శాఖ
మనోహర్ లాల్ ఖట్టర్ - పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం
ధర్మేంద్ర ప్రధాన్ - విద్యా శాఖ
కిరణ్ రిజుజు - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
రామ్మోహన్ నాయుడు - పౌర విమానయాన శాఖ
మన్‌సుఖ్ మాండవీయా - కార్మిక శాఖ, క్రీడలు
శ్రీపాద యశోనాయక్ - విద్యుత్ శాఖ
జేపీ నడ్డా - వైద్య శాఖ
పీయూష్ గోయల్ - వాణిజ్య శాఖ
శివరాజ్ సింగ్ చౌహాన్ - వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలు
గజేంద్ర సింగ్ షెకావత్ - టూరిజం, సాంస్కృతిక శాఖలు
జితిన్ రామ్ మాంఝీ - చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
శోభా కరంద్లాజే - చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖల సహాయ మంత్రి
భూపేందర్ యాదవ్ - పర్యావరణ శాఖ
సీఆర్ పాటిల్ - జల్ శక్తి శాఖ
సురేశ్ గోపి - టూరిజం సహాయ మంత్రి
రావ్ ఇంద్రజీత్ సింగ్ - సాంస్కృతికం, పర్యటక శాఖల సహాయ మంత్రి
శర్బానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్
అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం
ప్రహ్లాద్ జోషి - ఆహార, వినియోగదారుల సంక్షేమం
కుమార స్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు
చిరాగ్ పాశ్వాన్ - క్రీడా శాఖ
జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం, ఈశాన్య రాష్ట్రాలు
గిరిరాజ్ సింగ్ - జౌళి
కిషన్ రెడ్డి - బొగ్గు, గనుల శాఖ
భూపతిరాజు శ్రీనివాస వర్మ - ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి