రామచరిత్మానస్‌లో కొంత మురికి ఉంది..దానిని తొలగించాలి- బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Mar 01, 2023, 09:51 AM IST
రామచరిత్మానస్‌లో కొంత మురికి ఉంది..దానిని తొలగించాలి- బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

రామచరిత్మానస్‌లో ఉన్న కొంత మురిని తొలగించాల్సిన అవసరం ఉందని బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ పురాణ కావ్యం సమాజంలో చీలికలను సృష్టించిందని ఆరోపించారు. 

పురాణ కావ్యమైన రామచరిత్మానస్‌లో కొంత మురికి ఉందని, దానిని తొలగించాలని ఆర్జేడీ నేత, బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ మరో సారి వివాదాన్ని రేకెత్తించారు. భారతీయ భక్తి కవి గోస్వామి తులసీదాస్ రచించిన రామచరితమానస్ సమాజంలో చీలికలను సృష్టించిందని ఆయన పునరుద్ఘాటించారు. తాను నేను రామచరితమానస్ గురించి మాట్లాడుతూనే ఉంటానని, మౌనంగా ఉండలేనని అన్నారు.

మార్చి 1న భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటినుంచే అమల్లోకి.. ఏది ఎంత పెరిగిందంటే...

గత నెలలో రామచరిత్మానస్ లోని అనేక దోహాలు (జంటలు) ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని, సమాజంలో వైరుధ్యాలను సృష్టిస్తున్నారని చెప్పి వివాదానికి దారి తీశారు. పాట్నాలోని నలంద ఓపెన్ యూనివర్శిటీ 15వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచరిత్మానస్ సమాజానికి ఒక శాపం, సమాజాన్ని కలిపే బదులు అది విచ్ఛిన్నం చేస్తోంది అని అన్నారు. రామచరితమానస్ విద్వేషాన్ని వ్యాప్తి చేసే, సమాజాన్ని విభజించే పుస్తకమని అభివర్ణించారు.

దళితులు, వెనుకబడిన వారు, మహిళలను విద్యకు దూరం చేయడమే కాకుండా వారి హక్కులను హరించడానికి కూడా రామచరితమానస్ ప్రయత్నించిందని అన్నారు. మనుస్మృతి సమాజంలో విద్వేష బీజాలు నాటిందని, ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వార్కర్ ఆలోచనలు సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని మంత్రి అన్నారు. దళితులు, అణగారిన వర్గాల హక్కులను కాలరాయడాన్ని సమర్థించినందుకే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుస్మృతిని తగులబెట్టారన్నారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ప్రేమానురాగాలను పెంపొందించడం వల్ల భారతదేశం బలంగా, సుసంపన్నంగా మారుతుందని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి చేసిన ఈ ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ విషయంపై బీజేపీ నితీష్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది.

2017 భోపాల్-ఉజ్జయిని రైలు బాంబు పేలుడు కేసులో 7గురికి మరణశిక్ష, మరొకరికి జీవితఖైదు

గత నెలలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య రామచరిత్మానస్‌ వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మొదలుపెట్టారు. ‘‘ధోల్, గన్వార్, శూద్ర, పశు, నారీ, సకల్ తదన్ కే అధికారి’’ అనే పదాలను ఆయన ప్రస్తావిస్తూ రామచరితమానస్ లోని కొన్ని శ్లోకాలు సమాజంలోని పెద్ద వర్గాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు. వీటిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీనిపై తరువాత సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. రామచరిత మానస్ కు తాను వ్యతిరేకం కాదని, హిందూ ఇతిహాసంలోని ఓ శ్లోకంపై వివాదం 5,000 సంవత్సరాల నాటిదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా ఆయన ‘‘మేము రామచరితమానస్‌కు వ్యతిరేకం కాదు. దేవుడు ఏ ఒక్కరి కోసం కాదని, అందరి కోసం.’’ అని అన్నారు.

స్మగ్లింగ్ కు అడ్డాగా ముంబై ఎయిర్ పోర్ట్.. ₹ 25 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం..నిందితుడి అరెస్టు

అయితే రామచరిత్మానస్ కాపీని తగలబెట్టడం ద్వారా 100 కోట్ల మంది హిందువులను సమాజ్‌వాదీ పార్టీ అవమానించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత శనివారం ఆరోపించారు. ఎస్పీ నేత మౌర్య అభ్యంతరకరంగా అభివర్ణించిన ఈ పద్యంపై సీఎం ఆదిత్యనాథ్ వివరణ ఇస్తూ ‘తడన్’ అంటే ‘దేఖ్‌భాల్’ (జాగ్రత్త) అని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu