మార్చి 1న భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటినుంచే అమల్లోకి.. ఏది ఎంత పెరిగిందంటే...

Published : Mar 01, 2023, 08:01 AM IST
మార్చి 1న భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటినుంచే అమల్లోకి.. ఏది ఎంత పెరిగిందంటే...

సారాంశం

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో నిలకడ కొనసాగింది. మార్చి 1న ఒక్కసారిగా ఈ ధర రూ.50 పెరిగి షాక్ ఇచ్చింది.

ఢిల్లీ : సామాన్యుడి  నెత్తిన మరో పిడుగు పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి.  మార్చి నెల మొదటి తేదీనే ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి.  కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు,  డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండు కూడా పెరిగాయి  ప్రజల జేబుకు చిల్లులు పడుతున్నాయి.  కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా రూ. 350 రూపాయల పెరిగింది.  డొమెస్టిక్  గ్యాస్ సిలిండర్ ధరలు రూ.50 పెరిగాయి. 12.2 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర ఇప్పుడు 1155 కు చేరుకుంది.  

 నేడు పెరిగిన రేట్ల  ప్రకారం చూస్తే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1103కు  చేరుకుంది. ముంబైలో  పెరిగిన  రేట్లతో కలిపి రూ.1102కు  చేరింది. కోలకత్తాలో  రూ.1129, చెన్నైలో రూ.1118కి చేరుకున్నాయి. ఈ పెరిగిన రేట్లతో చూస్తే తెలుగు రాష్ట్రాలలో  సిలిండర్ ధర 50 రూపాయలు పెరగడంతో మొత్తంగా రూ.1155కు  చేరింది.  గత ఎనిమిది నెలల నుంచి సిలిండర్ ధర తెలుగు రాష్ట్రాల్లో పెరగలేదు.  హైదరాబాదులో గ్యాస్ సిలిండర్ ధర రూ.1155 కాగా.. ఆంధ్ర ప్రదేశ్ లో  50 రూపాయలు పెరగడంతో  సిలిండర్ ధర రూ.1161కి  చేరింది.

2017 భోపాల్-ఉజ్జయిని రైలు బాంబు పేలుడు కేసులో 7గురికి మరణశిక్ష, మరొకరికి జీవితఖైదు

 ఇది నిజంగానే సామాన్యుడి నెత్తిన పెనుబారంగా మారనుంది. సిలిండర్ ధర పెరిగినా కూడా సబ్సిడీ రావడం లేదు.  గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది కానీ ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తివేయడంతో సిలిండర్ ధరతో . ఎలాంటి సంబంధం సబ్సిడీకి ఉండడం లేదు. 

 ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు విషయానికి వస్తే ఏకంగా అవి 350 రూపాయల మేర పెరిగాయి.  ఈ పెరిగిన రేట్లతో  రాష్ట్రాల వారీగా చూస్తే  ఢిల్లీలో రూ. 2119 కి కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది.   అంతకుముందు దీని ధర రూ. 1769గా  ఉండేది. కోల్కతాలో రూ. 1870 నుంచి రూ. 2221కి  పెరిగింది.  ముంబైలో రూ.1721గా  ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 350 పెరిగి రూ. 2071కి  చేరుకుంది.  ఇక చెన్నై విషయానికి వస్తే రూ. 1917 గా ఉన్న  ధర  ఇప్పుడు  రూ.2268కి పెరిగింది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu