
లక్నో : భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడు కేసులో దోషులుగా ఉన్న ఎనిమిది మందిలో ఏడుగురికి జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది.మరొకరికి జీవిత ఖైదు పడింది.మహ్మద్ ఫైసల్, గౌస్ మహ్మద్ ఖాన్, అజార్, అతిఫ్ ముజఫర్, డానిష్, మీర్ హుస్సేన్, ఆసిఫ్ ఇక్బాల్‌లకు మరణశిక్షలు మరియు అతిఫ్ ఇరాకీకి జీవిత ఖైదు విధించబడింది. 2017 భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైలు బాంబు పేలుడు ఒక ఉగ్రవాద దాడి ఇది మార్చి 7, 2017 న జరిగింది.
ఫిబ్రవరి 24న, భోపాల్-ఉజ్జయిని రైలు పేలుడు సూత్రధారులకు సహాయం చేశారన్న ఆరోపణలపై ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, శిక్షా పరిమాణాన్ని మంగళవారానికి రిజర్వ్ చేసింది. 2017 భోపాల్-ఉజ్జయిని రైలు పేలుడు కేసులో 10 మంది గాయపడిన కేసులో ఏడుగురు నిందితులకు మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు తీర్పునిచ్చింది.
నిందితులు ఐఈడీలను తయారు చేసి పరీక్షించారని, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వాటిని అమర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. 2017 మార్చి 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఉజ్జయిని మధ్య ఉన్న జాబ్రీ రైల్వే స్టేషన్‌లో చిన్నపాటి పేలుడు సంభవించింది.
నిందితులు మహ్మద్ ఫైసల్, గౌస్ మహ్మద్ ఖాన్, మహ్మద్ అజర్, అతిఫ్ ముజఫర్, మహ్మద్ డానిష్, సయ్యద్ మీర్ హుస్సేన్, ఆసిఫ్ ఇక్బాల్ ‘రాకీ’కి మరణశిక్ష విధిస్తూ అదనపు జిల్లా న్యాయమూర్తి వివేకానంద్ శరణ్ త్రిపాఠి ఎన్ఐఏ కోర్టులో తీర్పు చెప్పారు. మహ్మద్ అతీఫ్‌కు జీవిత ఖైదు పడింది.
ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్.. హత్య చేయడానికి మూడు కత్తులు ఆన్‌లైన్‌లో కొనుగోలు
ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ ఎన్ఐఏ న్యాయవాది బ్రిజేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ .. "భోపాల్-ఉజ్జయిని రైలు పేలుడులో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 121 ప్రకారం ఏడుగురు దోషులకు మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదును కోర్టు ప్రకటించింది." నిందితులందరినీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నో, ఉన్నావ్ జిల్లాల నుంచి అరెస్టు చేశారు.
తొలుత ఎనిమిది మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్ నం. 03/2017 మార్చి 8, 2017న లక్నోలోని ఏటీఎస్ లో, మార్చి 14, 2017న ఎన్ఐఏ ద్వారా మళ్లీ నమోదు చేయబడింది. లక్నోలోని వారి హాజీ కాలనీ రహస్య స్థావరం నుండి ఒక నోట్‌బుక్ కూడా స్వాధీనం చేసుకుంది, ఇందులో వారి టార్గెట్స్, బాంబు తయారీకి సంబంధించిన వివరాల గురించి చేతితో రాసిన నోట్‌లు ఉన్నాయని ఎన్ఐఏ దర్యాప్తు పేర్కొంది.