దేశంలో 13 కోట్ల మోడీలు ఉన్నారు.. వారందరికీ ఫిర్యాదు చేసే హక్కు ఉండదు - బెయిల్ పిటిషన్ లో రాహుల్ గాంధీ

Published : Apr 04, 2023, 02:13 PM IST
దేశంలో 13 కోట్ల మోడీలు ఉన్నారు.. వారందరికీ ఫిర్యాదు చేసే హక్కు ఉండదు - బెయిల్ పిటిషన్ లో రాహుల్ గాంధీ

సారాంశం

తాను దోషిగా తేలిన పరువునష్టం కేసును కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో సోమవారం సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలు ప్రస్తావించారు. దేశంలో 13 కోట్ల మంది మోడీలు ఉన్నారనీ, తన వ్యాఖ్యలు వారందరినీ ఉద్దేశించినవి కావని తెలిపారు. 

దేశంలో 13 కోట్ల మంది మోడీలు ఉన్నారని, వీరందరికీ తన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎందుకంటే మోడీ సామాజిక వర్గం అంటూ రికార్డుల్లో ఎక్కడా లేవని అన్నారు. తను అందరిపై వ్యాఖ్యలు చేయలేదని, తన మాటల్లో సారంపై, స్ఫూర్తిపై దృష్టి సారించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని తెలిపారు. 

కోవిడ్‌కి గుండెపోటుకు ఏమైనా సంబంధముందా? ఆరోగ్య మంత్రి మన్సుఖ్ సమాధానమిదే

‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ నుంచి అనర్హత వేటు వేయడానికి దారితీసిన కేసులో తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఏప్రిల్ 13న విచారించనుంది. పరువు నష్టం కేసులో మార్చి 23న కాంగ్రెస్ మాజీ చీఫ్ ను దోషిగా నిర్ధారించి మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు ఆయనకు 30 రోజుల పాటు బెయిల్ మంజూరైంది. ఆ మరుసటి రోజే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం లోక్ సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడింది.

కాగా.. తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టులో సోమవారం దాఖలు చేసిన అప్పీల్ లో.. కింది న్యాయస్థానం ఉత్తర్వులు తప్పుగా, వికృతంగా ఉన్నాయని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు పడే విధంగా తనకు శిక్ష విధించారని ఆరోపించారు. ట్రయల్ కోర్టు తనతో దురుసుగా ప్రవర్తించిందని, ఎంపీగా తన హోదాను విపరీతంగా ప్రభావితం చేసిందని తెలిపారు.

మోదీని డిగ్రీ గెలిపించలేదు.. ఆయనను ప్రశ్నించాల్సింది దాని గురించి కాదు.. అజిత్ పవార్...

రాహుల్ గాంధీ తన పిటిషిన్ లో ఇంకా ఏం పేర్కొన్నారంటే ? 
సీజేఎం (చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్) విధించిన శిక్ష, తీర్పు తప్పు. నిష్కపటమైన వక్రబుద్ధితో కూడినదని రాహుల్ గాంధీ తన పిటిషన్ లో పేర్కన్నట్టు వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది. క్రిమినల్ చట్టంలో అస్సలు అనుమతించని ఊహలు, ఊహాగానాలు ఆధారంగా ఈ తీర్పును ప్రకటించారని పేర్కొన్నారు.

‘‘మోడీలు 13 కోట్లు (సంఖ్యలో) ఉన్నారు. వీరందరికీ ఫిర్యాదు చేసే హక్కు ఉండదు, ఎందుకంటే ఇది గుర్తించదగిన ఖచ్చితమైన, నిర్ణయాత్మక సమూహం కాదు’’ అని రాహుల్ గాంధీ పిటిషన్ లో తెలిపారు. రికార్డుల్లో మోడీ సమాజం, సామాజికవర్గం అనేవేవీ లేవన్నారు. ప్రతి కమ్యూనిటీలోనూ మోడీలు ఉన్నారని తెలిపారు.

కోవిడ్ ఎఫెక్ట్: మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు

నాలుగుసార్లు ఎంపీగా తాను ఎన్నికయ్యానని, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా తన మాటలను ఎప్పుడూ బంగారు కొలమానాలతో తూకం వేయలేరని, అందువల్ల తన స్వరంపై కాకుండా చేసిన ప్రసంగం (మోడీ ఇంటిపేరుకు సంబంధించినది) సారం, స్ఫూర్తిపై దృష్టి సారించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. నిజమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి బలమైన, రాజీలేని ప్రతిపక్షం చాలా అవసరమని తెలిపారు. 

ప్రభుత్వ విమర్శకుడిగా, చట్టసభ సభ్యుడిగా తన విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అధికారంలో ఉన్నవారికి చికాకు, ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. ‘‘దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంది అనే వ్యాఖ్యలు ప్రధాని మోడీ, నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో సంబంధం కలిగి ఉన్నాయని, కానీ ‘మోడీ’ ఇంటిపేరు ఉన్న వ్యక్తుల అందరికీ ఉద్దేశించినవి కావు’’ అని తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?