
ఢిల్లీలో గర్భిణిపై కాల్పులు జరిపిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డీజే సౌండ్ తగ్గించమన్నందుకు నిండు గర్భిణీ పై ఓ దుండగుడు .ఈ కాల్పుల్లో గాయపడిన మహిళకు అబార్షన్ అయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు .. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఈ అమానుష్య ఘటన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని సిరస్పూర్ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. ఔటర్ ఢిల్లీలోని సమయపూర్ లో నివాసం ఉండే హరీష్ అనే వ్యక్తి ఇంట్లో ఓ వేడుక చేసుకున్నారు. అందులో భాగంగా వారు డీజే సౌండ్ ను చాలా పెద్దగా పెట్టారు. దీంతో వారి పొరుగింట్లో ఉండే రంజు అనే నిండు గర్భణీ ఆమె వదినతో కలిసి .. హరీష్ ఇంటికి వెళ్లి డీజే సౌండ్ ఆపమని కోరింది. దీంతో హరీశ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త కాల్పులకు దారి తీసింది.
ఈ క్రమంలో హరీశ్ స్నేహితుడు అమిత్.. గర్భణీ రంజు పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆమె మెడకు తీవ్రగాయాలైయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రంజు మెడపై బుల్లెట్ గాయమైందనీ, ఆమెకు గర్భస్రావం అయిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రంజు చికిత్స పొందుతోంది. ఆమెకు పలు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరముందని వైద్యులు తెలిపారు. నిందితుడితో పాటు స్నేహితుడిని అరెస్టు చేశారు
కాల్పులు జరిపిన హరీష్, అతని స్నేహితుడు అమిత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై హత్యాయత్నం, ఆయుధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో హరీష్ డెలివరీ బాయ్ కాగా, మరొకరు అమిత్ మొబైల్ రిపేరింగ్ షాపులో పనిచేస్తున్నారు. కాల్పులకు గురైన బాధితురాలి గ్రుహిణీ, ఆమె భర్త కూలీగా పనిచేస్తున్నాడు. బీహార్‌కు చెందిన రంజు కుటుంబం ఢిల్లీలో అద్దె ఇంట్లో ఉంటోంది.
ఈ ఘటనపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) రవి కుమార్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలు రంజు పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు ఆమె ప్రత్యక్ష సాక్షి కోడలు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సుమారు 12:15 గంటలకు పిసిఆర్‌కు కాల్ వచ్చిందని, సిరస్‌పూర్‌లో కాల్పుల ఘటన జరిగినట్లు సమాచారమందని తెలిపారు. గాయపడిన రంజు అనే మహిళను షాలిమార్‌బాగ్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. గొంతులో బుల్లెట్ గాయమైందని, వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి లేదని వైద్యులు పోలీసులకు తెలిపారు.