ప్రముఖ థియేటర్ నటుడు, దర్శకుడు ఆమిర్ రజా హుస్సేన్ కన్నుమూత

By Asianet NewsFirst Published Jun 5, 2023, 2:18 PM IST
Highlights

ప్రముఖ థియేటర్ దర్శకుడు, నటుడు ఆమిర రజా హుస్సేన్ శనివారం కన్నుమూశారు. ఆయన రాసిన, నిర్మించిన, నటించిన ఎన్నో నాటకాలు మనకు వదిలి వెళ్లిపోయారు. ఆయన నిర్మించిన ది ఫిఫ్టీ డే వార్, ది లెజెండ్ ఆఫ్ రామ్ నాటకాలు ప్రఖ్యాతి గాంచినవి.
 

న్యూఢిల్లీ: బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు వస్తున్న ఆదిపురుష్ వంటి భారీ చిత్రాలను భారత్ నిర్మించకముందు ఇంతటి భారీతనం, సృజనాత్మకత ఆమిర్ రజా హుస్సేన్ థియేట్రికల్ ప్రొడక్షన్‌లలో కనిపించేది. ఆయన కార్గిల్ యుద్ధం ఆధారంగా నిర్మించిన ఫిఫ్టీ డే వార్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. అంతటి భారీతనం, విజన్ 2000 సంవత్సరం వరకు మరే ప్రొడక్షన్‌లోనూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.

అంతటి సృజనకారుడు, దర్శకుడు, నటుడు హుస్సేన్ తన 66వ యేటా జూన్ 3వ తేదీన కన్నుమూశారు. స్టేజ్ ప్రొడక్షన్‌లో ఆయన సృజనాత్మక సంపదను వదిలిపెట్టి వెళ్లారు.

ఆమిర్ రజా హుస్సేన్ భార్య విరాట్ తల్వార్. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. 

ది ఫిఫ్టీ డే వార్ కార్గిల్ కథను వివరిస్తుంది. ఒరిజినల్ ఇండియన్ స్క్రిప్ట్‌తో ఇండియన్ స్టేజ్ పై ఇంత భారీతనంతో ఎవరూ ప్రయత్నించే సాహసం చేయలేదు. ఆ తర్వాత ది లెజెండ్ ఆఫ్ రామ్ 1994లో స్టేజ్ పై ప్రదర్శించారు. ఇవి థియట్రికల్ స్పెక్టాకల్స్‌గా మిగిలిపోయి భావి థియట్రికల్ ప్రొడక్షన్‌లకు ప్రమాణంగా మారిపోయాయి.

ది లెజెండ్ ఆఫ్ రామ్ ప్రదర్శనకు సుమారు మూడు ఎకరాల పెట్టు ఉండే 19 ఔట్ డోర్ సెట్లు ఏర్పాటు చేసుకున్నారు. 35 మంది నటులు, 100 మంది టెక్నికల్ సిబ్బంది. దీని చివరి షో 2004 మే 1వ తేదీన అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శనకు వేశారు.

హుస్సేన్ 1957 జనవరి 6వ తేదీన కులీన కుటుంబంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో హుస్సేన్, తల్లి, తల్లి కుటుంబంతోనే పెరిగారు. అజ్మేర్‌లోని మయో కాలేజీకి వెళ్లాడు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్ర చదివారు.  అక్కడ కాలేజీలో అనేక నాటకాల్లో నటించారు. జాయ్ మైఖేల్, బ్యారీ జాన్, మార్కస్ మర్చ్ వంటి లెజెండ్‌ల దర్శకుల నాటకాల్లో నటించారు. ఈ విధంగా హుస్సేన్ ప్రయాణం ఇంగ్లీష్ నాటకాలతో మొదలైంది. 

Also Read: యూట్యూబ్‌లో నకిలీ ముల్లాల బోధనలు ప్రమాదకరం.. ఊహా ప్రపంచంతో వాస్తవ సమస్యలు పరిష్కృతమవుతాయా?

1984లో కిమ్, 2014లో ఖూబ్‌సూరత్ అనే సినిమాల్లో హుస్సేన్ కనిపించారు. కానీ, ఆయన థియేటర్‌కే తన సమయాన్ని, ఆలోచనలను కేటాయించారు. 

సారే జహా సే అచ్ఛా, 1947 లైవ్, సత్యమేవ్ జయతే వంటి ఎన్నో నాటకాలను నిర్మించి ఔట్ డోర్ లొకేషన్‌లలో ప్రదర్శించారు. 

91 నాటకాల నిర్మాణం, 1,100 ప్రదర్శనలు చేసిన ఆయనను 2001లో ప్రభుత్వ పద్మ శ్రీ బిరుదుతో సత్కరించింది.

హుస్సేన్ ఇటీవలే తన ఇంటర్వ్యూలో థియేటర్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాధపడ్డారు. ఇది మన దేశంలో ఒక హాబీగా ఉన్నది, లేదా ద్వితీయ శ్రేణి ప్రొఫెషన్‌గా ఉన్నదని అన్నారు. అయితే, ఉజ్వలమైన సినిమాకు ఈ థియేటర్ ప్రోగ్రామ్‌లే నర్సరీగా ఓనమాలు నేర్పిస్తున్నాయి.

click me!