ఇళ్లలో పాచి పని చేస్తూ భర్తను చదివించిన భార్య.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మరో యువతితో కలిసి ఉంటూ..

By Asianet News  |  First Published Jul 10, 2023, 2:59 PM IST

భర్తను ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలనే కోరికతో ఓ భార్య నాలుగు ఇళ్లలో పని చేసింది. అతడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఖర్చులన్నీ ఆమె భరించింది. తీరా ఉద్యోగం వచ్చిన తరువాత భార్యను అతడు దూరం పెట్టాడు. వేరే మహిళతో కలిసి జీవిస్తున్నాడు. 


ఇటీవల తెగ వైరల్ అయిన జ్యోతి మౌర్య కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. కష్టపడి భర్త ఆమెను చదివేస్తే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత అతడిని వదిలేసి వేరే వ్యక్తితో ఉంటోందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే దీనికి పూర్తిగా రివర్స్ లో మధ్యప్రదేశ్ లో మరో ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ భార్య పలు ఇళ్లలో పని చేస్తూ భర్తను చదివించింది. అతడికి ఉద్యోగం వచ్చిన తరువాత ఆమెను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. 

సత్యేందర్ జైన్ కు ఊరట. మధ్యంతర బెయిల్ ను పొడగించిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ?

Latest Videos

‘ఇండియూ టుడే’ కథనం, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..  ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్యోతి మౌర్య, ఆమె భర్త.. ఆమె భర్త కూడా పోటీ పరీక్షకు ఆమె చదువుకు సహకరించాడని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాకు చెందిన మమత, కమ్రులు ప్రేమికులు. వీరిద్దరూ 2015లో వివాహం చేసుకున్నారు. అప్పటికే కమ్రూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కానీ ఎలాంటి ఉద్యోగం లేదు. దీంతో అతడికి భార్య అండగా నిలబడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని ప్రోత్సహించింది. దానికి అవసరమైన ఖర్చులు తానే భరిస్తానని అతడి బాధ్యత ఆమె భుజాలపై వేసుకుంది. 

దీంతో కమ్రూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. అయితే పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు, ఇంటి అవసరాలను తీర్చడానికి ఆమె పలువురి ఇళ్లల్లో పని చేసింది. ఆమె గిన్నెలు కడగడం, ఇళ్లను శుభ్రం చేయడం వంటి పనులు చేసింది. ఎట్టకేలకు మమత ప్రోత్సహకం ఫలించింది. కమ్రూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, 2019-20లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందాడు.

అజిత్ పవార్ కు ఎదురుదెబ్బ.. శరద్ పవార్ వర్గానికి తిరిగొచ్చిన మరో ఎన్సీపీ ఎమ్మెల్యే..

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత అతడి మనసు పూర్తిగా మారిపోయింది. కమ్రూ రత్లాంలో పోస్టింగ్ ఇవ్వడంతో తొలుత మమతను తీసుకొని అక్కడే కాపురం పెట్టాడు. కొంత కాలం తరువాత అతడికి మరో మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను పుట్టింటికి పంపించి, ఆమెతో కాపురం ప్రారంభించాడు. అయితే దీంతో ఆమె మమతకు కోపం వచ్చింది. 2021 ఆగస్టులో కమ్రుపై కేసు పెట్టింది. 

తరువాత మమతకు అతడు నెలకు రూ.12వేలు భృతి ఇచ్చేందుకు అంగీకరించాడు. కానీ ఆమెతో ఉండేందుకు ఇష్టపడలేదు. విధిలేని పరిస్థితిలో బాధితురాలు దీనికి అంగీకరించింది. అయితే కొంత కాలం నుంచి అతడు మళ్లీ మాటతప్పాడు. నెలకు ఇస్తానని చెప్పిన రూ.12 వేలను ఆమెకు ఇవ్వడం లేదు. దీంతో ఆమె ఆ డబ్బుల కోసం ప్రస్తుతం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది.

కెమెరాలు వెంట పెట్టుకొని వరి నాట్లు వేసిన మొదటి రైతు రాహుల్ గాంధీ - బీజేపీ

కాగా.. మమతకు కమ్రుతో ఇది రెండో వివాహం. పెళ్లయిన రెండున్నరేళ్లకే ఆమె మొదటి భర్త చనిపోయాడు. అతడితో మమతకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు కూడా కొన్ని నెలల కిందట తన 15 సంవత్సరాల వయస్సులో మరణించాడు. భర్త చనిపోయిన కొంత కాలం తరువాత తన దూరపు బంధువు అయిన కమ్రుతో ఆమె ప్రేమలో పడింది. తరువాత వారిద్దరు వివాహం చేసుకున్నారు. 
 

click me!